జంతువులతో సెక్స్.. తప్పు ఎక్కడుంది?

మేక

ఫొటో సోర్స్, Getty Images

హరియాణాలోని మేవాత్‌లో గర్భంతో ఉన్న ఒక మేకపై కొంత మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డంతో అది మరణించిందన్న వార్త ఇటీవల పత్రికల ప్రధాన శీర్షికల్లో వచ్చింది. అలాగే ఏపీలోనూ ఆవుపై అత్యచారం జరిగిందని వార్తలు వచ్చాయి.

అయితే ఈ రెండు కేసుల్లోనూ ఆ జంతువులపై అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరణ కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images

కానీ.. జంతువులతో సెక్సా?

జంతువులతో సెక్స్‌లో పాల్గొనడాన్ని ఇంగ్లిష్‌లో బెస్టియాలిటీ అంటారు. దానికి క్రూరంగా ప్రవర్తించడం అనే మరో అర్థం కూడా ఉంది.

ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారం - ఒక మనిషి, జంతువుతో నిర్వహించే లైంగిక చర్యను బెస్టియాలిటీ అంటారు.

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) వెబ్‌సైట్ ప్రకారం, ఎవరైనా మనుషులు జంతువుతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం చాలా తీవ్రమైన విషయం.

కానీ ఇలాంటి కేసులు చాలా తక్కువ. భారతదేశంలో ఇది ఒక శిక్షించదగ్గ నేరం.

ఫొటో సోర్స్, Thinkstock

ఎన్‌సీబీఐ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, బెస్టియాలిటీ అనేది ఒక రకమైన లైంగిక హింస. దానిలో లైంగిక తృప్తి కోసం ఒక జంతువును ఉపయోగించుకోవడం జరుగుతుంది.

బాల్యంలో గృహహింసను లేదా లైంగిక హింసను ఎదుర్కొనే బాధితుల్లో ఇలాంటి ప్రవృత్తి ఏర్పడుతుందని ఎన్‌సీబీఐ నివేదిక పేర్కొంది.

దిల్లీకి చెందిన సెక్సాలజిస్ట్ వినోడ్ రైనా ప్రకారం, జంతువులతో సెక్స్ జరిపే వారిలో 'శాడిస్టిక్' లక్షణాలు ఉంటాయి. ఇది ఒక మానసిక వ్యాధి.

దీనికి లైంగిక వైఫల్యం, లైంగిక ఊహలు కారణాలు కావచ్చని డాక్టర్ రైనా అంటారు.

''చాలాసార్లు చుట్టూ ఉన్న వాతావరణం కూడా బెస్టియాలిటీకి దారి తీస్తుంది. కొన్ని కుటుంబాలలో సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. అలాంటప్పుడు సెక్స్ గురించి తెలుసుకోవడానికి జంతువులను ఉపయోగించుకుంటారు'' అని డాక్టర్ రైనా తెలిపారు.

కొన్నిసార్లు చిన్నపిల్లలు ఇలాంటి చర్యలకు పాల్పడతారు. అయితే పిల్లలు ఇలాంటి చర్యలకు పాల్పడితే వాటిని తేలికగా తీసుకోకూడదు. ముందుముందు అది చాలా ప్రమాదానికి దారి తీయవచ్చు.

మొదటి కేసు ఎక్కడ?

హరియాణా ఘటన చాలా మందిని విస్మయపరిచినా, ఇదే మొదటి కేసు కాదు. అమెరికాలోని ఈశాన్య ఫ్లోరిడాలో సెక్స్ కోసం ఇలా మేకలను ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు.

భారతదేశంలో అలాంటి కేసులను సెక్షన్ 377 కింద నమోదు చేస్తున్నారు. భారతదేశంతో పాటు నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లలో కూడా ఇలాంటి లైంగిక చర్యలు నిషిద్ధం.

అయితే హంగరీ, ఫిన్లాండ్‌లలో మాత్రం దీనిని నేరంగా పరిగణించడం లేదు.

రెండో కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం మండ‌లానికి చెందిన గోకివాడ అనే గ్రామంలో గోవుపై అత్యాచారం జరిగిందని వార్తలొచ్చాయి.

ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు.. కానీ వైద్యులు మాత్రం గోవుపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించలేదు.

ఫొటో సోర్స్, Getty Images

వింత వింత ప్రవృత్తులు

  • కొంతమంది జంతువులను పెంచుకుంటారు. వాటి పట్ల ఆకర్షితులవుతారు. అయితే వాటితో సెక్స్‌లో పాల్గొనరు.
  • మరికొందరు వాటిని కౌగిలించుకుంటారు. జననాంగాలను సృశిస్తారు. కానీ వాటితో సెక్స్‌ చేయరు.
  • ఇంకొందరు జంతువులలోని ప్రతి అంగాన్ని పరిశీలిస్తారు. వాటి మధ్య జరిగే లైంగిక కార్యకలాపాలను ఆసక్తితో చూస్తారు. వాటిని చూసి ఉత్తేజం పొందుతారు.
  • మరికొంత మంది జంతువులపై అత్యాచారం చేస్తారు. అదే సమయంలో వాటిని హింసిస్తారు కూడా.
  • మరికొందరు లైంగిక కార్యకలాపాల సందర్భంగా జంతువులను చంపేస్తారు. అవి మరణించాక కూడా వాటితో సెక్స్‌లో పాల్గొంటారు.

ఫొటో సోర్స్, Getty Images

దీనికి షాక్ ట్రీట్‌మెంటే పరిష్కారం!

ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ప్రవీణ్ దీనికి అనేక థెరపీలున్నాయని తెలిపారు. ఒక థెరపీలో ఆ వ్యక్తి ఒక జంతువుతో ఉన్నాడన్న భ్రమ కల్పిస్తారు. అదే సమయంలో అతనికి షాక్ ఇస్తారు. దీని వల్ల భవిష్యత్తులో ఏదైనా జంతువుతో లైంగిక కార్యకలాపాలకు ప్రయత్నించినా ఆ బాధ గుర్తుకు వచ్చి, దానికి దూరంగా ఉంటాడు.

ప్రస్తుతం అలాంటి అసహజ ప్రవృత్తి ఉన్నవారికి ఇంకా ఎన్నో ఆధునిక విధానాలలో చికిత్స అందిస్తున్నారు. కానీ షాక్ ట్రీట్‌మెంటే ప్రధానంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌)