కరుణానిధి: కావేరి ఆస్పత్రి వద్ద కన్నీరుమున్నీరవుతున్న పార్టీ కార్యకర్తలు

  • 7 ఆగస్టు 2018
కరుణానిధి కోసం విలపిస్తున్న పార్టీ కార్యకర్తలు

ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణించినట్లు చెన్నైలోని కావేరి ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుని విలపిస్తున్నారు. పోలీసులు నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

రాష్ట్రంలో రెండు రోజులపాటు సినిమా ప్రదర్శనలు స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు థియేటర్ల యజమానులు ప్రకటించారు.

రాజాజీ హాలును పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు.

కావేరి ఆస్పత్రి వద్ద పరిస్థితిని కళ్లకు కడుతున్న ఫొటోలివి..

చిత్రం శీర్షిక కావేరి ఆస్పత్రి వద్ద మెడికల్ ఎమర్జెన్సీ వాహనం
చిత్రం శీర్షిక చెన్నై నగరవ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు
చిత్రం శీర్షిక రాజాజీ హాలు వద్ద పోలీసులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)