కళైంజర్ కమ్యూనిస్టు పార్టీలో చేరేవారేమో: 11 ఆసక్తికరమైన విషయాలు

 • 8 ఆగస్టు 2018
 1. క్రికెట్ అంటే ఇష్టమున్న హాకీ ప్లేయర్ : కరుణానిధికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఆయన చిన్నప్పుడు హాకీని చాలా ఇష్టంగా ఆడేవారు. స్కూల్ టీంలోనూ ఆడారు.
 2. మొదటి ప్రసంగం స్నేహంపై : ఈయన మొదటిసారిగా స్నేహం అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. ఎనిమిదో తరగతిలో అంటే 1939లో తమ పాఠశాలలో ఈ ఉపన్యాసం చేశారు.
 3. చేతిరాత పత్రిక: 1941లో ఈయన చేతిరాత పత్రిక మానవ నేసన్ (విద్యార్థి మిత్ర)ను ప్రారంభించారు. కరుణ మొదటి పత్రిక ఇదే. ఇది మాస పత్రికగా నడిచేది.
 4. అలా అయితే కమ్యూనిస్ట్ పార్టీలో కలిసేవారేమో : కరుణ ద్రవిడ ఉద్యమ ఆలోచనలకు ఆకర్షితులు కాకుండా ఉంటే.. కమ్యూనిస్ట్ పార్టీలో చేరేవారు. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో వెల్లడించారు.
 5. మాడ్రన్ థియేటర్లో కుదిరిన స్నేహం : ఎంజీఆర్‌కి, కరుణానిధికి స్నేహం ఏర్పడింది సేలంలోని మాడ్రన్ థియేటర్లో.
 6. రాధిక తండ్రి ఇచ్చిన బిరుదు : కరుణను కళైంజర్ అని పిలుస్తుంటారు. మరి ఆయనకు ఆ బిరుదు ఇచ్చింది ఎం ఆర్ రాధ. ఈయన రాధిక తండ్రి. తూక్కు మేడై (ఉరి కంబం) అనే నాటకం చూసి ఎంఆర్ రాధ ఈ బిరుదు ఇచ్చారు.
 7. మహిళల కోసం: తల్లిదండ్రుల ఆస్తిలో మహిళలకు సగం హక్కు దక్కేలా అసెంబ్లీలో చట్టం చేసింది ఈయనే.
 8. మనుషులు లాక్కెళ్లే రిక్షాలను ఈయన 1973లోనే రద్దు చేశారు.
 9. ఎంజీఆర్‌కి పురట్చి నడిగర్ (విప్లవ నటులు) అనే బిరుదు ఇచ్చింది ఈయనే.
 10. అన్ని గ్రామాలకూ విద్యుత్ అనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం 2018లో పెట్టుకుంది. కానీ కరుణానిధి 1969లోనే తమిళనాడులో అన్ని గ్రామాలకూ విద్యుత్తు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
 11. కరుణ తన పార్టీ అధికారిక పత్రిక 'మురసోలి'లో రాస్తున్న 'ఉదాన్‌పిరప్పి' (ఓ సోదరుడా...) లేఖల సీరియల్.. ప్రపంచంలో న్యూస్‌పేపర్ సీరియళ్లలో అతి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సీరియల్.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)