ఈ రాళ్ల కూర రుచి చూస్తారా?
ఈ రాళ్ల కూర రుచి చూస్తారా?
దీన్ని చూస్తే నోరూరిపోతుంది కదూ! ఇంతకీ ఇదేం వంటకం అనుకుంటున్నారా? రాళ్లతో చేసిన కూర.
ఆశ్చర్యపోవద్దు... గుజరాత్లోని కటీలు దీన్ని తింటుంటారు.
నదీతీరంలో దొరికే రాళ్లను, శనగ పిండి, మజ్జిగతో కలిపి వండుతారు. పండుగలప్పుడు ప్రత్యేకంగా చేసుకునే ఈ కూరను స్థానికంగా 'చబ్లా నీ కడి' అని పిలుస్తారు.
అయితే, రాళ్లను ఎలా అరిగించుకుంటారు అనుకోవద్దు.. రాళ్లతో కూర వండినా తినేటప్పుడు మాత్రం వాటిని వదిలేయాలి.
ఈ రాళ్లను కలిపి కూరను వండటం వల్ల వాటిలోని కాల్షియం కూర ద్వారా శరీరంలోకి చేరుతుందని చెబుతుంటారు.
ఇంకో విషయం ఏంటంటే.. దీన్ని వండేందుకు కేవలం అయిదు నిమిషాలు చాలట.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)