పోఖ్రాన్: 1998 మే 11న భారత్ మూడు భూగర్భ అణు పరీక్షలు జరిపిన తరువాత వాజ్‌పేయి ఏమన్నారు?

పోఖ్రాన్: 1998 మే 11న భారత్ మూడు భూగర్భ అణు పరీక్షలు జరిపిన తరువాత వాజ్‌పేయి ఏమన్నారు?

పోఖ్రాన్ అణుపరీక్షలను విజయవంతంగా చేసిన (1998) మే 11వ తేదీని భారతదేశం జాతీయ టెక్నాలజీ దినోత్సవంగా జరుపుకుంటోంది. మొదటిసారిగా ఈ రోజును 1999 మే 11న అధికారికంగా జరుపుకున్నారు.

పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపినప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్ళకు భయపడలేదు. అణు పరీక్షల గురించి బయట ప్రపంచానికి తెలియజేయని నాయకులకు భిన్నంగా ఆయన అణుబాంబును పరీక్షించడమే కాకుండా ధైర్యంగా ప్రకటించారు. ఆయుధ సామర్థ్యంలోనూ ప్రపంచ దేశాలకు దీటుగా నిలవడంలో వాజ్‌పేయి తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం కీలకమైంది.

''ఈ రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు పోఖ్రాన్‌లో భారత్ మూడు భూగర్భ అణు పరీక్షలు జరిపింది'' అని 1998 మే 11న వాజ్‌పేయి ప్రకటించారు.

మే 11న మూడు, మే 13న రెండు మొత్తం ఐదు అణు పరీక్షలు జరిపింది భారత్. ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్న అబ్దుల్ కలామ్, అణుశక్తి సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్. చిదంబరం 'ఆపరేషన్ శక్తి' పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సమన్వయకర్తలుగా పనిచేశారు. ఈ పరీక్షలకు గుర్తుగా మే 11న జాతీయ సాంకేతిక దినంగా జరుపుకొంటున్నాం.

వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన నెల రోజుల్లోనే ఈ పరీక్షలు జరిపారు.

'ఇవికూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)