అమ్మ పాలు... బాటిల్ రూ.250

  • 19 ఆగస్టు 2018
జ్యోతి

ప్రకృతిలో అమ్మ పాల స్థానాన్ని మరేవీ భర్తీ చేయలేవు. కానీ వైద్య పరమైన కారణాల వల్ల కొందరు తల్లులు పాలివ్వలేరు. అలాంటివాళ్ల పిల్లలు ఇకపై తల్లి పాలకు దూరమవ్వాల్సిన అవసరం లేదు. దేశంలో కొత్తగా తల్లిపాలను సైతం అమ్మే సంస్థలు అందుబాటులోకి వస్తున్నాయి.

దిల్లీలోని ‘అమరా’ అనే సంస్థ కూడా అలాంటిదే.

పాలను దానమివ్వడానికి సిద్ధపడే తల్లుల నుంచి ఆ సంస్థ పాలను సేకరిస్తుంది. వాటిని భద్రపరిచి అవసరమైన వారికి అందిస్తుంది.

సునీత అనే మహిళ కొన్ని రోజులుగా అలా వేరే తల్లులు ఇచ్చిన పాలనే తన పిల్లలకు పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఆమె నెలలు నిండని కవలలకు జన్మనిచ్చారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఇప్పుడు అందరికీ అందుబాటులో అమ్మపాలు

‘పాలను దానమిచ్చే తల్లులంటే నాకు చాలా గౌరవం. వాళ్లు కూడా నాలాంటి అమ్మలే. నాకు ఇద్దరు నెలలు నిండని పిల్లలు పుట్టారు. సిజేరియన్‌తో పాటు నా వయసు కారణంగా వాళ్లకు పాలివ్వడం సాధ్యపడట్లేదు. తరువాత ఆస్పత్రిలోనే తల్లిపాలు దొరుకుతాయని ఇంట్లో చెప్పా. ఇంట్లో వాళ్లు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

మొదట్లో ఆ పాల నాణ్యతపైన అనుమానాలుండేవి. నా పిల్లలకు అవి సరిపడతాయో లేదో అని భయం వేసేది. కానీ నా పిల్లల ఎదుగుదలను చూశాక చాలా సంతోషమేసింది’ అంటారు సునీత.

చిత్రం శీర్షిక సునీత

మరో పక్క జ్యోతి అనే మహిళ చాలా కాలంగా తన పాలను ఇతర పిల్లల కోసం దానమిస్తున్నారు. తన వల్ల ఒక్క బిడ్డ ప్రాణం నిలబడినా చాలని ఆమె చెబుతున్నారు.

‘మా పాపకు నేరుగా నా చనుబాలు తాగడం సాధ్యం కాలేదు. కొన్న పాలను తనకు పట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎలక్ట్రానిక్ పంప్ సాయంతో నా చనుబాలను సేకరించడం మొదలుపెట్టా. కానీ నా పాప తాగేదానికన్నా ఎక్కువ పాలు బయటికొచ్చేవి. దాంతో చాలా పాలు వృథా అయ్యేవి.

ఆ పాలు వృథా కాకుండా అవసరమైన వారికి దానం చేయొచ్చని, పాలు రాని తల్లులకు అవి ఉపయోగపడాతయని మా డాక్టర్ సలహా ఇచ్చారు. నేనిప్పుడు అదే పని చేస్తున్నా. గత ఆర్నెల్లుగా పాలను దానమిస్తున్నా.

నా పాల వల్ల ఎక్కడో చోట ఒక్క చిన్నారి ప్రాణమైనా నిలబడి ఉంటుందని నా భర్తతో అప్పుడప్పుడూ అంటుంటా’ అని జ్యోతి చెప్పారు.

చిత్రం శీర్షిక జ్యోతి

అమరా లాంటి చాలా పాల బ్యాంకులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అమరా బ్యాంకు రెండేళ్లలో దాదాపు వెయ్యి లీటర్ల పాలను సేకరించింది. ‘ముందు సేకరించిన పాలను మేం పరీక్షిస్తాం. తరవాత వాటిని శుద్ధి చేసి భద్రపరుస్తాం. ఫ్రీజ్ చేసిన పాలను ఆర్నెల్ల వరకు ఉపయోగించొచ్చు’ అంటారు అమరా మిల్క్ బ్యాంక్‌కు చెందిన వైద్యుడు రఘు.

ఒక బాటిల్ పాల ధర రూ.200-250 మధ్య ఉంటుంది. కానీ, దానమిచ్చే తల్లులు మాత్రం ఆ పాలకు డబ్బులు తీసుకోరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

LIVE: కోడెల శివప్రసాద్ ఆత్మహత్య.. ‘బసవతారకం ఆస్పత్రిని స్థాపించారు.. అక్కడే చనిపోయారు’

బోటు ప్రమాదంలో 12 మంది మృతి.. రాజమండ్రిలో సీఎం జగన్ సమీక్ష.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

‘ఉద్యోగాల లోటు లేదు, ఉత్తర భారతీయుల్లో వాటికి అర్హులు లేరు’ - కేంద్ర మంత్రి

కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..

ప్రెస్ రివ్యూ: గోదావరి పడవ ప్రమాదంపై యజమాని సమాధానమిదే

11 త‌రాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ

గోదావరిలో పడవ మునక: 'భర్తను, బిడ్డను పోగొట్టుకుని ఎలా బతకాలి...'

9/11 పుట్టిన తేదీ, 9.11 గంటలు పుట్టిన సమయం, పాప బరువు 9.11 పౌండ్లు.. ఏమిటీ చిత్రం