డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - కేజీ రూ.9 వేలు
- బిపల్ కుమార్ షా
- బీబీసీ
వీడియో: 'గోల్డెన్ స్వీట్' రుచి చూస్తారా?
రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి పండుగలు సమీపిస్తున్న తరుణంలో గుజరాత్‌లోని సూరత్ నగర వాసులను 'గోల్డెన్ స్వీట్' ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది.
దీని ధర కిలో రూ.9000.
'24 క్యారెట్' అనే మిఠాయి దుకాణం వారు తయారు చేసిన ఈ స్వీట్ కొద్దిరోజుల్లోనే స్థానికంగా భలే పాపులరైంది.
'గోల్డెన్ స్వీట్' అనే పేరుకు తగ్గట్టుగానే ఈ స్వీట్‌కు బంగారు పూత పూశారు. దీని కోసమే ప్రత్యేకంగా స్పెయిన్ నుంచి కేసరి తెప్పించామని తయారీదారులు చెబుతున్నారు.
చక్కని పోషక విలువలు ఉండేలా ఈ స్వీట్‌ను తయారు చేశామని తెలిపారు.
"అత్యంత నాణ్యమైన జీడిపప్పును వాడాం. మరీ ముఖ్యంగా శుద్ధమైన బంగారు రేకు ఈ స్వీటుకు చుట్టాం" అని దుకాణం నిర్వాహకుడు రోహన్ చెప్పారు.
ఐదు వెరైటీలలో గోల్డెన్ స్వీట్ తయారు చేసినట్టు ఆయన వివరించారు.
మిఠాయి దుకాణం 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకంగా గోల్డెన్ స్వీట్‌ను తయారు చేశామని తయారీదారులు చెప్పారు.
ఆభరణాల కంటే, ఆహార పదార్థాల్లో బంగారం వాడటం చాలా ఖరీదుతో కూడుకున్న విషయమని ఆయన అంటున్నారు. ఎందుకుంటే.. అది కడుపులోకి వెళ్తుంది. అందుకు బంగారాన్ని బాగా శుద్ధి చేసి తినదగిన పదార్థంగా చేయాలి. ఇదంతా చేయడం వల్ల ఖర్చు పెరుగుతుందని చెబుతున్నారు.
దుకాణం ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా చేయాలన్న ఆలోచనతో ఈ ఖరీదైన స్వీట్ తయారు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
'డైమండ్ హబ్'గా ప్రసిద్ధి చెందిన సూరత్ నగరంలో స్వీట్లకూ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి ప్రజలు మిఠాయిలపై అమితమైన ప్రేమ చూపిస్తారు.
ఇవి కూడా చదవండి:
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- వీళ్లు పగలు లాయర్లు... రాత్రుళ్లు బార్లో ‘డ్రాగ్’ డాన్సర్లు
- ఆ రాజ్యానికీ రాజుకూ ఈ అందమైన, బలమైన మహిళా సైనికులే రక్ష
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- కేరళ వరద బాధితుల దాహం తీరుస్తున్న తెలుగువాళ్లు
- నాబార్డ్ రిపోర్ట్: వ్యవసాయ ఆదాయంలో దిగజారిన ఆంధ్రప్రదేశ్, జాతీయ సగటు కన్నా కాస్త మెరుగ్గా తెలంగాణ
- ‘పీరియడ్స్‌కు ముందు ఆమె మూడ్ హఠాత్తుగా మారిపోయేది...’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)