హైదరాబాద్ సామ్రాజ్యానికి ఐదు వందల ఏళ్లు

హైదరాబాద్ సామ్రాజ్యానికి ఐదు వందల ఏళ్లు

గంగా జమునా తహెజీబ్ వర్ధిల్లిన నేల.. ఇండోపర్షిన్ సంస్కృతి వికసించిన నేల.. గోల్కొండ సామ్రాజ్యం..

ఈ రాజ్యం ఏర్పడి ఈ ఏడాదికి సరిగ్గా 500 ఏళ్లు పూర్తవుతోంది.

గోల్కొండ కోటను అభివృద్ధి చేసి, హైదరాబాద్ మహా నగరాన్ని నిర్మించింది కుతుబ్ షాహీ రాజులు. వీరినే 'ఆంధ్రా సుల్తానులు'గా అభివర్ణిస్తుంటారు.

ఈ రాజ్య స్థాపకుడు సుల్తాన్ కులీ (కుతుబ్ ఉల్ ముల్క్). ఇరాన్‌లోని కారాకునీల్ తెగకు చెందిన ఈయన మొదటి బహమనీ రాజ్యంలో ఉద్యోగిగా చేరి ఆ తర్వాత గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించారు.

స్థానికుల్లో కలిసిపోయారు. స్థానిక భాషా సంస్కృతులను గౌరవించారు. అదే సమయంలో తమ సంస్కృతినీ కాపాడుకున్నారు. మరిన్ని వివరాలు వీడియోలో

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)