దిల్లీ స్కూళ్లలో ‘ఆనందం‘ పాఠాలు

ఫొటో సోర్స్, Getty Images
పాఠశాల చదువంటే అ..ఆలు.. ఏబీసీడీలు.. లెక్కలు.. ఎక్కాలే కాదు అంటోంది దిల్లీ విద్యా శాఖ.
దిల్లీలోని వెయ్యి పాఠశాలల్లో ‘ఆనందం’ అన్న సబ్జెక్టును కూడా సిలబస్లో చేర్చారు. ఆనందాన్ని చేర్చడమేంటి అన్న మీ ప్రశ్నకు పై వీడియో సమాధానం చెబుతుంది.
ఆనందం అనే సబ్జెక్టులో ధ్యానం చేయడం, కథలు చెప్పడం నేర్పుతారు.
పిల్లలకు మంచి హావభావాలు కూడా నేర్పుతారు. నర్సరీ నుంచి 8వ తరగతి వరకూ ఈ సబ్జెక్టును బోధిస్తారు.
ఆనందమయ జీవన సూచిలో భారత్ 133వ స్థానంలో ఉంది.
ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాబోధనలో ఈ సబ్జెక్టును చేర్చారు.
మరి ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్న విద్యార్థులు, నేర్పుతున్న టీచర్లు ఏమంటున్నారో కింది వీడియోలో చూడొచ్చు.
దిల్లీ స్కూళ్లలో ఆనందాన్ని బోధిస్తారు
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)