#లబ్‌డబ్బు: గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు?

  • 25 ఆగస్టు 2018
#లబ్‌డబ్బు: గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు?

మన ఆదాయం, వ్యయాన్ని బట్టి క్రమం తప్పకుండా కొంత పొదుపు చేసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం మానేసినా, రిటైరయ్యాక ఆ పొదుపు ద్వారా వచ్చే మొత్తం చాలా అవసరం.

పొదుపు అంశాల్లో ముఖ్యమైనది గ్రాట్యుటీ. అయితే అసలు గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీన్ని ఎలా లెక్కిస్తారు? ఈ వివరాలు ఇవాల్టి లబ్‌డబ్బులో చూద్దాం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption#లబ్‌డబ్బు: గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు?

గ్రాట్యుటీ అంటే?

మీరు ఏళ్ల తరబడి చేసిన పనికి ప్రతిఫలంగా కంపెనీ చెల్లించే మొత్తం. రిటైరయ్యాకనో, ఉద్యోగం వదిలేస్తేనో, లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తేనో.. కంపెనీ ఆ వ్యక్తికి గ్రాట్యుటీని చెల్లిస్తుంది. 1972లో గ్రాట్యుటీ చెల్లింపు చట్టం (పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్, 1972) రూపొందించింది. దీని ప్రకారమే కంపెనీలు నిర్ధారిత నియమాలు, షరతులకు లోబడి ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలు ఉద్యోగులు, సంస్థలు... ఇద్దరికీ వర్తిస్తాయి.

గ్రాట్యుటీ ఎన్నేళ్లకు వస్తుంది?

మీరు ఏడాదికీ, రెండేళ్లకీ ఉద్యోగాలు మారుతుంటే మీకు గ్రాట్యుటీ ఎప్పటికీ అందని ద్రాక్షే. ఏదైనా కంపెనీలో 5 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు పనిచేసినవారే గ్రాట్యుటీకి అర్హులవుతారని చట్టం చెబుతోంది.

Image copyright Getty Images

గ్రాట్యుటీ లెక్కింపు ఇలా...

ప్రభుత్వ పెన్షన్ పోర్టల్ ప్రకారం... గ్రాట్యుటీ అనేది 15 రోజుల బేసిక్ శాలరీ, డీఏల మొత్తానికి సమానం. ఇది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది మీ వేతనం, రెండోది మీరు ఎంతకాలం పనిచేశారనే సర్వీస్ పీరియడ్. ఆరునెలలు అంతకన్నా ఎక్కువ కాలం ఉన్న సమయాన్ని సంవత్సరంగానే లెక్కిస్తారు. మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారో అంత కాలానికి సంవత్సరానికి 15 రోజుల బేసిక్ శాలరీ, డీఏలను లెక్కించి దీన్ని చెల్లిస్తారు.

దీనికి కనిష్ఠ పరిమితి అంటూ ఏమీ లేదు. కానీ గరిష్ఠ పరిమితి రూ.20 లక్షలు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... టాక్స్ ఫ్రీ. ఉద్యోగం మానేసినా, రిటైర్మెంట్ తర్వాత అయినా 30 రోజులలోపు గ్రాట్యుటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కంపెనీ అయినా గ్రాట్యుటీ చెల్లించకపోయినా లేదా చెల్లించాల్సిన దానికన్నా తక్కువ చెల్లించినా అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరి కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రధాన నిందితుడైన బోటు యజమాని, మరో ఇద్దరి అరెస్ట్

ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు?

నిర్మలా సీతారామన్: కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు... లాభాలతో ఉరకలెత్తిన సెన్సెక్స్

ఆంధ్రప్రదేశ్: గ్రామ స‌చివాల‌య ఉద్యోగ ప‌రీక్ష‌లపై వివాదం ఏంటి? ప్రభుత్వం ఏమంటోంది?

గోదావరి పడవ ప్ర‌మాదాలు: ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఫలితాలేమైనా ఉన్నాయా?

గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు.. మేట్ 30 ప్రోలో మూవీ కెమెరా

వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'