లబ్‌డబ్బు: ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్య బీమాతో ప్రయోజనాలివీ..

  • 1 సెప్టెంబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionలబ్‌డబ్బు: వైద్య బీమా ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి?

దేశంలో 10 కోట్లకుపైగా కుటుంబాలకు ఏటా రూ.5లక్షల విలువైన ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం 'ఆయుష్మాన్ భారత్'ను సిద్ధం చేస్తోంది.ఇందుకోసం ఆయుష్మాన్ భారత్ వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ఈ నెల (సెప్టెంబర్) 5న ప్రారంభించనుంది. ఈ ఆరోగ్య బీమా ఉంటే కలిగే ప్రయోజనాలు ఏంటో.. లేకుంటే వచ్చే నష్టం ఏంటో ఈ వారం బీబీసీ లబ్‌డబ్బులో చూద్దాం.

Image copyright Getty Images

ముందుగా ఒకసారి దేశంలో ఆరోగ్య లెక్కలు చూద్దాం. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. దేశంలో ఏటా 5 కోట్ల మంది అనుకోకుండా వచ్చే వైద్య ఖర్చుల వల్ల పేదలుగా మారిపోతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే భారత్‌లో ఆరోగ్య సేవల పరిస్థితి దారుణంగా ఉందని అంటోంది. 195 దేశాల ఆరోగ్య సూచీలో భారత్ 145వ స్థానంలో ఉంది.

పొరుగు దేశం భూటాన్ కూడా భారత్ కన్నా మెరుగైన.. అంటే 134వ స్థానంలో ఉంది.

Image copyright Getty Images

వైద్యానికి బడ్జెట్ కేటాయింపులు చాలా తక్కువ

భారత్‌లో వైద్యరంగంపై చేస్తున్న ఖర్చు జీడీపీలో 1.25 శాతం మాత్రమే. అదే బ్రెజిల్లో 8.3 శాతం, రష్యాలో 7.1 శాతం ఖర్చు పెడుతున్నారు. దక్షిణాఫ్రికా 8.8 శాతం ఖర్చు చేస్తోంది.

దక్షిణాసియా దేశాల విషయానికి వస్తే.. అఫ్గానిస్తాన్ మొత్తం జీడీపీలో 8.2 శాతం, మాల్దీవులు 13.7 శాతం, నేపాల్ 5.8 శాతం ఖర్చు చేస్తున్నాయి.

భారత్ విషయానికొస్తే… పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల కన్నా తక్కువ ఖర్చు చేస్తోంది.

Image copyright Getty Images

సరిపడా వైద్యులేరీ?

దేశంలో 14 లక్షల మంది వైద్యుల కొరత ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ భారత్‌లో ఏడు వేల మందికి ఒక డాక్టర్ ఉన్నారు.

80 శాతం జనాభాకు సరైన వైద్య సేవలు అందే ఏర్పాటు లేదు. దేశంలో 67 శాతం మంది తమ జేబులోంచే మెడికల్ బిల్లులు చెల్లిస్తారని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) రిపోర్టు చెబుతోంది.

ఇప్పటికి కేవలం 4 శాతం మంది మాత్రమే వ్యక్తిగత వైద్య బీమా పథకంలో చేరారు.

దేశంలో చాలా మంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వైద్య బీమా పథకాలతో లబ్ధి పొందుతున్నారని సీఐఐ నివేదిక చెబుతోంది.

చాలా రాష్ట్రాలు వేర్వేరు నాయకుల పేరిట వైద్య బీమా పథకాల్ని ప్రకటించాయి. 7 శాతం మందికి స్థానిక సంస్థల లేదా ఇతర స్కీముల సదుపాయం ఉంది.

Image copyright Getty Images

ఆయుష్మాన్ విషయానికి వద్దాం.

ఇది కేంద్ర ప్రభుత్వ సరికొత్త పథకం. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాయి.

ఈ పథకం కింద దేశంలో 10 కోట్లకు పైగా కుటుంబాలకు ఏటా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించనున్నారు.

బీమా కోసం వెచ్చించే మొత్తానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు.


ఆరోగ్య బీమా లేకుంటే

  • వైద్య సేవలు తక్కువగా లభిస్తాయి.
  • సకాలంలో సేవలు అందకపోవచ్చు.
  • ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
  • వైద్య ఖర్చుల భారం పెరగొచ్చు.

(మరిన్ని విరాలను పై వీడియోలో చూడొచ్చు)


ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)