ఉదయం నుంచే సందడి మొదలైనా..

  • 2 సెప్టెంబర్ 2018
సభలో టీఆరెస్ మహిళా నేతలు Image copyright facebook/TRSParty
చిత్రం శీర్షిక ప్రగతి నివేదన సభలో టీఆర్ఎస్ మహిళా నేతలు

ఉదయం 11 గంటల నుంచే టీఆర్ఎస్ శ్రేణులు బహిరంగ సభకు రావడం మొదలైంది. కళాకారుల బృందం ప్రభుత్వ పథకాలను పాటల రూపంలో పాడుతూ అక్కడికి వచ్చిన వారిని ఉత్సాహపరిచారు.

కేసీఆర్ సభా వేదికకు చేరుకుంటున్న సమయంలో మహిళ కార్యకర్తలు ఉత్సాహంతో నృత్యాలు చేశారు.

బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ ఊహించినంత స్పందన కనిపించలేదు.

సాధారణంగా కేసీఆర్ సభలో ఉపన్యసించినా అది ప్రజలతో సంభాషిస్తున్నట్లే ఉంటుంది. మధ్యమధ్యలో వారిని ఉత్సాహపరుస్తూ.. వారి నుంచి స్పందన కోరుతూ.. దీనికేమంటారు, దానికేమంటారు అంటూ ప్రసంగిస్తుంటారు. కానీ, ఈ సారి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకుంటూ ఆయన ప్రసంగం సాగింది.

కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలోనే ప్రజలు తిరుగుముఖం పట్టడం కనిపించింది.

Image copyright facebook/TRSParty

ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్

రాజకీయ నేతగా, ఉద్యమ నేతగా, సీఎంగా కేసీఆర్ ప్రస్థానాన్ని వివరిస్తూ ప్రగతి నివేదన సభ వద్ద ఏర్పాటుచేసిన ఫొటో ప్రదర్శన ఆకట్టుకుంది.

ఈ ఫొటో ప్రదర్శనకు సంబంధించి దీన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేత ధర్మేంద్ర స్థానిక మీడియాతో మాట్లాడారు.

2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన కొన్ని ఘట్టాలు, గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరిస్తూ ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని చెప్పారు.

కేసీఆర్ కరీంనగర్ సభ, సైకిల్ యాత్ర, రాజోలిబండ పాదయాత్ర, పల్లె నిద్ర వంటి ఘట్టాలకు సంబంధించిన ఫొటోలు ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)