సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. నిర్మాణం ఎలా జరుగుతోంది? ఆవిష్కరించేది ఎప్పుడు?

తయారవుతున్న పటేల్ విగ్రహం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

గుజరాత్‌లో తయారవుతున్న సర్దార్ పటేల్ విగ్రహం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం తయారీ ముగింపు దశకు చేరుకుంది.

భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్ రాష్ట్రంలో ఈ విగ్రహం ఏర్పాటవుతోంది. దీని ఎత్తు 182 మీటర్లు.. అంటే 600 అడుగులు.

చైనాలోని ‘స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ’ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీని ఎత్తు 128 మీటర్లు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన ప్రాజెక్టుగా పరిగణిస్తున్న ఈ విగ్రహం తయారీకి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం దాదాపు రూ. 2,990 కోట్లు.

ఐక్యతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ)గా పిలుస్తున్న దీన్ని అక్టోబర్ 31వ తేదీన మోదీ ఆవిష్కరించనున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

జాతీయవాది అయిన పటేల్‌ను భారత దేశ ఉక్కు మనిషి అని పిలుస్తుంటారు

1947లో భారతదేశానికి స్వతంత్రం లభించిన తర్వాత దేశ ఉప ప్రధానిగా పటేల్ పనిచేశారు.

అప్పట్లో భారతదేశంలో కలిసేందుకు విముఖంగా ఉన్న, విభేదిస్తున్న పలు రాష్ట్రాలను జాతీయవాది అయిన పటేల్‌ ఒప్పించి, ఏకం చేసి భారతదేశంలో ఐక్యం చేసినందుకు.. ఆయన్ను భారత దేశ ఉక్కు మనిషి (ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా) అని కూడా పిలుస్తుంటారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

విగ్రహం పనుల్ని పర్యవేక్షిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్‌ భాయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్

భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసిన నెహ్రూ వంశం పట్ల పక్షపాతం వల్ల చరిత్రలో సర్దార్ పటేల్‌కు సముచిత స్థానం లభించలేదని చాలామంది హిందూ జాతీయవాదులు భావిస్తుంటారు.

‘సర్దార్ పటేల్ తొలి ప్రధాని కాకపోవటం వల్ల ప్రతి భారతీయుడూ విచారం వ్యక్తం చేస్తున్నారు’ అని 2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ అన్నారు.

2013 ఎన్నికల్లో మోదీ విజయం సాధించిన తర్వాత ఈ కంచు విగ్రహం తయారీ పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణం పూర్తయితే.. న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే సర్దార్ పటేల్ విగ్రహం రెండు రెట్లు ఎత్తుగా ఉంటుంది.

ఫొటో సోర్స్, AFP

పటేల్ విగ్రహం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి పర్యాటకులు పెరుగుతారని ఆశిస్తున్నారు. అహ్మదాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

విగ్రహం మూడోవంతు ఎత్తులో.. ఛాతి భాగం లోపల ఒక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు

సుమారు 153 మీటర్ల ఎత్తులో ఉండే పటేల్ విగ్రహ ఛాతి భాగంలో గ్యాలరీని కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

పటేల్ విగ్రహం తయారీకి వేలాది మంది కార్మికులు పనిచేస్తుండగా.. వారికి వందలాది మంది చైనా వలస కార్మికులు కూడా సహకరిస్తున్నారు

నిర్ణీత గడువులోపు ఈ విగ్రహ తయారీ పనులు ముగించేందుకు 2500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. చైనా నుంచి వచ్చిన వందల మంది వలస కార్మికులు కూడా తమ వంతు సాయం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)