అరణ్‌దీప్ ఇవాంక దాస్: ‘నేను అమ్మాయిలాగా మారుతున్నా.. ఇది సెక్స్‌కు సంబంధించినది కాదు’

అరణ్‌దీప్ దాస్ ఇవాంక

ఫొటో సోర్స్, arandeepdas.sonudas/facebook

ఫొటో క్యాప్షన్,

ఇతని పేరు అరణ్‌దీప్ దాస్. త్వరలోనే ఇతను ఆమెగా మారనున్నారు. ఇవాంక అనే పేరు కూడా ఖరారు చేసుకున్నారు

తమను ఒక ప్రత్యేక జెండర్‌గా గుర్తించాలని, తమకూ అందరిలాగే హక్కులు ఉండాలని... ట్రాన్స్‌జెండర్లు లేదా హిజ్రాలు పోరాడుతున్నారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 377ను రద్దు చేయాలంటూ ఎల్జీబీటీక్యూ సముదాయాలకు చెందిన వారు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తుది తీర్పు ఇంకా రావాల్సి ఉంది.

అయితే, దిల్లీలోని అరణ్‌దీప్ దాస్, త్వరలోనే అమ్మాయిగా మారనున్నారు.

ఎందుకు ఆయన ఆమెలా మారబోతున్నారు? ఆమెగా మారుతున్న ఆయన మాటల్లోనే…

వీడియో క్యాప్షన్,

వీడియో: అరణ్‌దీప్ దాస్.. ఇకపై ఇవాంక దాస్

నా పేరు ఇవాంక. నేను కొరియోగ్రాఫర్‌ను.

ఇంతకు ముందు నా పేరు అరణ్‌దీప్ దాస్.

ఇప్పుడు నేను లింగమార్పిడి చేయించుకుంటున్నాను.. అమ్మాయిగా మారబోతున్నాను.

లింగ సమానత్వం కోరుకునేవాళ్లు.. స్త్రీ, పురుష, గే, బైసెక్సువల్ వంటి వాటినేవీ పట్టించుకోరు. ఇది సెక్స్‌కు సంబంధించినది కాదు. ఇది కేవలం భావోద్వేగాలకు సంబంధించినది.

ఫొటో సోర్స్, arandeepdas.sonudas/facebook

ఫొటో క్యాప్షన్,

అరణ్‌దీప్ ఇవాంకాలా మారే ప్రక్రియ అంత సులువైందేమీ కాదు. మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. రాళ్లు వేసేవాళ్లూ ఉంటారు. అలాగే పూలు చల్లే వాళ్లూ ఉన్నారు

బాలీవుడ్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ కొరియోగ్రఫర్ కావాలని...

గత 15 ఏళ్ల నుంచి కొరియోగ్రఫర్‌గా పని చేస్తున్నా.

నేను పైకి పురుషునిగానే కనబడతాను. పురుషునిగానే డ్యాన్స్ చేస్తుంటాను. ఇకపై అమ్మాయిగా చేయాలని అనుకుంటున్నా. ఎనిమిదేళ్ల క్రితం నాకు ఇంత అవగాహన లేదు.

నేను మహిళనా, పురుషుడినా అన్నదాంతో నాకు పనిలేదు. నేను మాత్రం ప్రదర్శనలు ఇస్తుంటాను. నాకు తోడుగా ఇతర డ్యాన్సర్లు ఉంటారు. అలాంటప్పుడు మహిళ అయితే ఏంటి? పురుషుడు అయితే ఏంటి? నేను మహిళగా ఉండటమే మంచిదనుకుంటున్నా.

బాలీవుడ్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ కొరియోగ్రఫర్ కావాలని అనుకుంటున్నా. ఇప్పటి వరకూ బాలీవుడ్‌లో ట్రాన్స్‌జెండర్ కొరియోగ్రాఫర్ ఎవ్వరూ లేరు.

నేను పుట్టింది అరణ్‌దీప్‌గా ఉండటానికి కాదు.

నాలో మరొకరు ఉన్నారన్న విషయం చాలా ఆలస్యంగా గ్రహించాను.

నేను అమ్మాయనే విషయాన్ని గుర్తించా. అందుకే పేరు మార్చుకున్నా.

పరిపూర్ణ స్త్రీత్వం కోసం లింగమార్పిడి చేయించుకుంటున్నా.

ఫొటో సోర్స్, arandeepdas.sonudas/facebook

ఫొటో క్యాప్షన్,

‘లింగమార్పడి అంటే.. శారీరకంగా అమ్మాయిగానో లేక అబ్బాయిగానో మారడం కాదు. అది భావోద్వేగాలకు సంబంధించింది’

వింతగా చూస్తారు.. నపుంసకులంటారు.. కొడతారు...

వివక్ష అనేది నిన్న ఉండేది. నేడు ఉంది. రేపూ ఉంటుంది. నేను జీవితంలో ముందునుంచీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. కొందరు మమ్మల్ని వింతగా చూస్తుంటారు. నపుంసకులుగా జమకడతారు. కొన్నిసార్లు కొట్టారు కూడా.

మా కుటుంబం కూడా నాకు అండగా నిలబడలేదు.

నేనెవరో తెలుసుకోవడానికి వాళ్లకు 30 ఏళ్లు పట్టింది.

నాలో భావోద్వేగాలు అకస్మాత్తుగా మారుతుంటాయి. ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు. ఒక్కోసారి కోపం, ఒక్కోసారి ప్రేమ.. ఇలా భావోద్వేగాలు త్వరగా మారిపోతుంటాయి.

హార్మోన్లలో మార్పులు చాలా ఇబ్బంది పెడతాయి.

ఒకోసారి ఏ పనీ చేయలేను. నా మిత్రులు, నాతో పని చేసేవారు, శ్రేయోభిలాషులు అండగా నిలుస్తున్నారు. ఎందుకంటే నేను అమ్మాయిననే విషయం వారికి తెలుసు. ఏది ఏమైనా, నాకు నచ్చిన పనినే నేను చేస్తా. ఆ విషయం వాళ్లకూ తెలుసు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)