స్వప్నా బర్మన్: పొలాల్లో పరుగు నేర్చిన అమ్మాయి... భారత్‌కు ‘తొలి’ పసిడి తెచ్చింది

స్వప్నా బర్మన్... నిన్న మొన్నటి దాకా ఈ పేరు చాలామందికి తెలీదు. కానీ ఇటీవలే ఆమె చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించారు. జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం గెలుపొంది, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.

పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగురి జిల్లాలో ఓ చిన్న గ్రామం స్వప్న స్వస్థలం. స్వప్న చదువుకునే రోజుల్లోనే ఆమె తండ్రి గుండెపోటుతో మంచానపడ్డారు. తల్లి ఉదయం టీ తోటలో పనిచేస్తూ, సాయంత్రం స్వప్నను కోచింగ్‌కు తీసుకెళ్లేవారు.

వరి పొలంలో పరుగు నేర్చుకున్న స్వప్న, ఎన్నో సమస్యలను దాటుకొని హెప్టాథ్లీట్‌గా చరిత్ర రచించారు.

ఈ నేపథ్యంలో బీబీసీ స్వప్న స్వగ్రామానికి వెళ్లింది. ఆమె కుటుంబంతో, కోచ్‌తో, గ్రామస్థులతో మాట్లాడింది. ఓ మారుమూల పల్లెలో పుట్టి పెరిగిన అమ్మాయి ఈ స్థాయికి చేరుకున్న క్రమాన్ని తెలుసుకుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)