స్వలింగ సంపర్కం నేరం కాదు: ఎల్‌జీబీటీ... తేడాలేంటి?

  • 6 సెప్టెంబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఎల్‌జీబీటీ... తేడాలేంటి?

లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్... వీళ్ల విషయంలో రకరకాల అపోహలు ఉంటాయి. వీళ్లందరికీ మధ్య ఉండే తేడాలేంటో చాలామందికి తెలీదు.

మొదట్లో చాలా తక్కువ లైంగిక పరిభాష ఉండేది. M, F - మగాళ్లు, ఆడాళ్లు.

వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి ఆకర్షణ ఏర్పడేది.

కానీ ఇప్పుడు పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి.

చెప్పాలంటే.. అక్షరాలు పెరిగిపోయాయి.

M, Fకు తోడు L, G, B, I, T, Q లు వచ్చాయి.

ఇప్పుడు ఆడామగా మధ్యే ఆకర్షణ ఉండాల్సిన అవసరం లేదు.

ఇంకా అనేక కాంబినేషన్లు కూడా ఉండే అవకాశం ఉంది.

మొదట L ను తీసుకుందాం. L అంటే లెస్బియన్.

లెస్బియన్ అంటే ఒక ఆడవ్యక్తికి మరో ఆడవ్యక్తిపై ప్రేమ పుట్టడం.

Image copyright Getty Images

మనకు స్త్రీపురుషుల మధ్య ప్రేమే తెలుసు.

అందుకే... లెస్బియన్లలో ఒకరు పురుషుల్లా ఉంటారని, వాళ్లు జుట్టు కత్తిరించుకుని ఉంటారని, ప్యాంటుషర్టు వేసుకుంటారని అనుకుంటారు. వాళ్లను బుచ్ అనేవాళ్లు.

ఇక రెండో పార్ట్‌నర్‌లో ఆడలక్షణాలు ఉంటాయని, వాళ్లు చీర కట్టుకుంటారని, వాళ్ల హావభావాలు కూడా ఆడవాళ్లలా ఉంటాయని అనుకునేవాళ్లు. వాళ్లను ఫెమ్ అనేవాళ్లు.

కానీ ఇవన్నీ పాత సిద్ధాంతాలు. లెస్బియన్లలో.. ఎవరి హావభావాల్లో అయినా, ఎలాంటి లక్షణమైనా ఉండొచ్చు.

ఇక G అంటే గే. గే అంటే ఒక మగవ్యక్తికి మరో మగవ్యక్తి మీద ప్రేమ కలగడం.

Image copyright Getty Images

గే అనే పదాన్ని ఇప్పుడు అన్ని వర్గాలు.. అంటే గే, లెస్బియన్, బైసెక్సువల్.. వీళ్లందరినీ కలిపి ఇప్పుడు గే అనే పదంతోనే పిలుస్తున్నారు.

ఇక B.. అంటే బైసెక్సువల్ విషయం చూద్దాం. బైసెక్సువల్ అంటే ఎవరికైనా, ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలగొచ్చు.

అంటే ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగొచ్చు, లేదా మరో ఆడవ్యక్తిపై ప్రేమ కలగొచ్చు. అలాగే ఒక ఆడవ్యక్తికి మరో ఆడవ్యక్తిపై లేదా మగవ్యక్తిపై ప్రేమ కలగొచ్చు.

తర్వాత T - అంటే ట్రాన్స్‌జెండర్. ట్రాన్స్‌జెండర్ అంటే మూడో జెండర్.

పుట్టినపుడు వీళ్లను మగపిల్లలో, ఆడపిల్లలో అనుకుంటారు. కానీ పెరిగి పెద్దయ్యాక వాళ్లు అనుకున్నదానికి భిన్నంగా తయారవుతారు.

Image copyright Getty Images

ఉదాహరణకు మగాడుగా పుట్టిన వ్యక్తిలో, పెద్దయ్యాక ఆడపిల్ల లక్షణాలు బైటపడొచ్చు.

అదే విధంగా ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో, పెద్దయ్యాక మగపిల్లల లక్షణాలు కనిపించొచ్చు.

ఇలాంటి వాళ్లు అప్పుడప్పుడూ తమ దుస్తులను మార్చుకుంటుంటారు.

అంటే వీళ్ల లోపల ఉండే ఆలోచన, దుస్తుల రూపంలో ప్రతిఫలిస్తుంది. వీళ్లను క్రాస్-డ్రస్సర్ అని పిలుస్తారు.

వీళ్లలో కొంతమంది, తమ మనసుతో పాటు శరీరం కూడా మారాలని అనుకుంటారు.

అలాంటి వాళ్లు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ లేదా సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ సహాయంతో తమ శరీరంలో మార్పులు చేసుకుంటారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

వీళ్లను ట్రాన్స్‌సెక్సువల్ అని పిలుస్తారు. ట్రాన్స్‌సెక్సువల్, క్రాస్-డ్రస్సర్స్.. వీళ్లిద్దరూ కూడా ట్రాన్స్‌జెండర్లే.

కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటుంది. ట్రాన్స్‌జెండర్ల ఆకర్షణను ఎలా నిర్వచిస్తారు?

ఎవరైనా మగపిల్లవాడుగా పుట్టి, పెద్దయ్యాక తనను తాను ఆడపిల్లలా భావించుకుంటూ... మరో మగపిల్లాడ్ని ప్రేమిస్తే, వాళ్లను హెటిరోసెక్సువల్ ట్రాన్స్‌జెండర్‌గా భావిస్తారు.

వాళ్లే ఒక ఆడపిల్లను ప్రేమిస్తే లెస్బియన్ ట్రాన్స్‌జెండర్ అని.. ఇద్దరినీ ప్రేమిస్తే బైసెక్సువల్ ట్రాన్స్‌జెండర్ అని పిలుస్తారు.

దానినే తిరగేసి చూస్తే.. ఎవరైనా ఆడపిల్లగా పుట్టి, పెద్దయ్యాక తనను తాను మగపిల్లాడిలా భావించుకుంటూ.. ఆడిపిల్లలను ప్రేమిస్తే వారిని హెటిరోసెక్సువల్ ట్రాన్స్‌జెండర్‌గా భావిస్తారు.

మగపిల్లలను ప్రేమిస్తే వాళ్లను గే ట్రాన్స్‌జెండర్‌ అని.. ఇద్దరినీ ప్రేమిస్తే బైసెక్సువల్ ట్రాన్స్‌జెండర్ అని పిలుస్తారు.

ఇప్పుడు I అంటే ఇంటర్‌సెక్స్ సంగతి చూద్దాం. పుట్టినపుడు జనానాంగాలను బట్టి వాళ్లు మగపిల్లలో, ఆడపిల్లలో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నవాళ్లను ఇంటర్‌సెక్స్ అంటారు.

డాక్టర్లు వాళ్లను పరిశీలించి.. ఈ పాప ఆడపిల్ల, వీడు మగపిల్లాడు అని చెబుతారు.

అయితే వీళ్లు పెద్దయ్యాక దానికి భిన్నంగా మారొచ్చు. కానీ - ట్రాన్స్‌జెండర్, ట్రాన్స్‌సెక్సువల్, క్రాస్‌డ్రస్సర్.. ఇవన్నీ పాశ్చాత్య పదాలు.

భారతదేశంలో మాత్రం వీళ్లు 'హిజ్రా'లు అనే పేరుతోనే ఎక్కువగా తెలుసు.

Image copyright Getty Images

హిజ్రాలు అంతా కలిసి మెలిసి ఒక కుటుంబంలా జీవిస్తారు. హిజ్రా, అరావనీ, కోథీ, శివశక్తి, జోగ్తి హిజ్రా.. దేశంలో వేర్వేరు ప్రాంతాలలో వాళ్లను ఇలా వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

ఇక వీళ్లలో చివరి వర్గం - Q. అంటే క్వీర్. ఈ వర్గం వాళ్లకు తాము ఎవరనే విషయంపై వాళ్లకే స్పష్టత ఉండదు. తాము మగాళ్లా, ఆడాళ్లా, ట్రాన్స్‌జెండరా అన్నది వాళ్లకే తెలీదు. తమకు ఎవరు ఇష్టం అన్నది కూడా వాళ్లకు అర్థం కాదు. అందుకే వీళ్లను క్వీర్‌తో పాటు క్వశ్చనింగ్ అని కూడా అంటారు.

మీకేదైనా అర్థం కాకుంటే వెనక్కి వెళ్లి మళ్లీ వీడియోను ప్లే చేసి చూడండి.

అంతే కాకుండా దీనిని మీ స్నేహితులందరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలా మందికి వీటన్నిటి మీద బోలెడంత కన్ఫ్యూజన్ ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక దాడుల మృతులు: వంద మరణాలు ఎందుకు తగ్గాయి.. తప్పుగా లెక్కించడానికి కారణాలేంటి

మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ

శ్రీలంక పేలుళ్లు: ఈ ఫొటోలు నిజమేనా

ప్రెస్ రివ్యూ:"కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి"- గవర్నర్‌కు కాంగ్రెస్ డిమాండ్

కిమ్ జోంగ్ ఉన్: ప్రపంచ రాజకీయాల్లో ఈ పేరంటే ఎందుకంత సంచలనం?

సీజేఐపై లైంగిక ఆరోపణల కేసు: త్రిసభ్య విచారణ కమిటీలో జస్టిస్ ఎన్వీ రమణ స్థానంలో జస్టిస్ ఇందూ మల్హోత్రా

శ్రీలంక పేలుళ్లు: "లెక్కల్లో పొరపాటు జరిగింది. మృతుల సంఖ్య 359 కాదు, 253"

ఈ దొంగలు మామూలోళ్లు కారు.. ఆర్టీసీ బస్ ఎత్తుకెళ్లి ఒక్క రోజులో ఏ పార్టుకు ఆ పార్టు విప్పేశారు