నొక్కువిద్య పవక్కలీ: ఈ బొమ్మల కళను కాపాడుతున్న చివరి వ్యక్తి ఈ అమ్మాయే

  • 9 సెప్టెంబర్ 2018
రంజిని

ఈ బొమ్మల కళను కాపాడుతున్న చివరి వ్యక్తి ఈ అమ్మాయే. ఇంతకీ ఏంటా కళ.. ఎవరా అమ్మాయి? ఆమె మాటల్లోనే..

నా పేరు రంజిని. ఇంటర్మీడియట్ చదువుతున్నాను. గత ఎనిమిదేళ్ల నుంచి దీన్ని ప్రదర్శిస్తున్నాను.

ఈ కళా రూపం పేరు నొక్కువిద్య పవక్కలీ. నొక్కు అంటే చూపు, విద్య అంటే నైపుణ్యం, పవక్కలీ అంటే బొమ్మలాట.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఈ బొమ్మల కళను కాపాడుతున్న చివరి వ్యక్తి ఈ అమ్మాయే

మా కుటుంబం అయిదు తరాలుగా దీన్ని ప్రదర్శిస్తోంది.

మా అవ్వ నుంచి దీన్ని నేర్చుకున్నాను. ఆమె ఏడు సంవత్సరాల వయసులో వాళ్ల అమ్మ నుంచి నేర్చుకుంది.

నాటి నుంచి మాకు ఇది వారసత్వంగా వస్తోంది. పై పెదవిపై కర్రను నిలబెట్టడం ద్వారా బొమ్మలను ఆడించడం ఇందులోని ప్రత్యేకత.

కర్రకు ఉండే తాడుతో బొమ్మలను ఆడిస్తారు.

కొన్ని తరాలుగా దీన్ని మహిళలు మాత్రమే ప్రదర్శిస్తూ వస్తున్నారు.

సంగీత వాయిద్యాలు వాయించడం, పాటలు పాడటం, బొమ్మలు ఆడించే మహిళలకు సహాయం అందించే పనుల్ని పురుషులు చేస్తారు.

ఇక్కడ ఉన్న ప్రతి బొమ్మనూ మా అవ్వే తయారు చేశారు.

అయితే వాటిని ఎలా చేయాలో ఇప్పుడు ఎవరికీ తెలియదు.

ఆడించే బొమ్మలను మా పెద్దన్నయ్య సిద్ధం చేస్తారు. కర్రకు బొమ్మలను కట్టడం, వాటిని అలంకరించడం వంటి పనులను చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా ఒక కళే. బొమ్మల ఆట వాటిని సిద్ధం చేసే తీరుపై ఆధారపడి ఉంటుంది.

నేను బొమ్మలను బాగా ఆడించగలను కానీ వాటిని సిద్ధం చేయడం మాత్రం నావల్ల కాదు.

ఈ కళలో 13 బొమ్మలు ఉంటాయి. ఇవి వివిధ రకాల బరువు తూగుతాయి. కొన్ని తేలికగా ఉంటాయి. మరికొన్ని బాగా బరువుగా ఉంటాయి.

మా తాతమ్మలు, వారి అమ్మల తరం నుంచి వస్తున్న ఈ సంప్రదాయ కళను ముందుకు తీసుకు పోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

నాకు ఈ కళను నేర్పినందుకు మా అవ్వకు రుణపడి ఉంటాను.

కేరళలోని ఈ మోనిపల్లి గ్రామంలో నివసిస్తున్న అవ్వ మనవరాళ్లు దీన్ని నేర్చుకునే వాళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీన్ని ఎలాగైనా రేపటి తరానికి అందించాలన్నదే వారి తపన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

వేట నిషేధం: మ‌త్స్య‌కారుల‌ కుటుంబాలకు మ‌హిళ‌లే ఆధారం

అక్షయ్-మోదీ ఇంటర్వ్యూ: మోదీ భాయ్‌కి పోటాపోటీగా స్వీట్లు పంపించే మహిళా నేతలు ఎవరో తెలుసా

శ్రీలంక పేలుళ్లు: సూసైడ్ బాంబర్‌తో మాట్లాడిన చర్చి ఫాదర్.. అప్పుడేం జరిగింది

కిమ్-పుతిన్ సదస్సు: రష్యా చేరుకున్న కిమ్.. తొలిసారిగా భేటీ కానున్న ఉత్తర కొరియా, రష్యా నాయకులు

లైంగిక వేధింపుల కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు: నాలుగు ప్రశ్నలు

ఐపీఎల్ 2019: చెన్నై సూపర్ కింగ్స్.. జట్టు సక్సెస్ సీక్రెట్ చెప్పిన ధోనీ

సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు

ఐక్యూ తక్కువని వైద్యులు చెప్పారు... ఆ అమ్మాయే ఒలింపిక్స్‌ పతకాలు తెచ్చింది