స్వలింగ సంపర్కం - సెక్షన్ 377: ఈ దేశాల్లో స్వలింగ సంపర్కం జరిపితే మరణశిక్షే

వీడియో క్యాప్షన్,

ఆ దేశాల్లో స్వలింగ సంపర్కానికి పాల్పడితే మరణశిక్షే

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వినగానే కొందరు లెస్బియన్లు, గేల కళ్లలో ఆనందంతో నీళ్లు తిరిగాయి.

'ఎల్‌జీబీటీ సభ్యులకు చరిత్ర క్షమాపణ చెప్పాలి' అని తీర్పు సందర్భంగా ఓ జడ్జి వ్యాఖ్యానించారు.

బ్రిటిష్ వలసవాద పాలనాకాలంలో భారత్‌లో స్వలింగ సంపర్కంపై నిషేధం అమల్లోకి వచ్చింది.

ప్రఖ్యాత రచయిత ఆస్కార్ వైల్డ్‌ గే సెక్స్‌కు పాల్పడ్డారని 19వ శతాబ్దం చివర్లో జైల్లో పెట్టారు. కానీ 'మాటల్లో నిర్వచించలేని ప్రేమ అది' అని 'టూ లవ్స్' కవితలో ఆస్కార్‌ వైల్డ్ ప్రేమను ఉద్దేశించి ఓ కవి రాశారు.

కొన్ని దేశాల్లో ఇప్పటికీ స్వలింగ సంపర్కానికి మరణ శిక్ష విధిస్తారు. సౌదీ అరేబియా, సూడాన్, యెమెన్‌, ఇరాన్‌లో ఆ శిక్ష అమల్లో ఉంది.

నైజీరియా, సొమాలియాల్లోని కొన్ని ప్రావీన్సుల్లోనూ స్వలింగ సంపర్కానికి మరణశిక్ష వేస్తారు.

అఫ్గానిస్తాన్ , పాకిస్తాన్, యూఏఈ, ఖతార్, మారిషానియాల్లోనూ మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. కానీ ఆ దేశాల్లో ఇప్పటిదాకా అలాంటి శిక్ష విధించిన దాఖలాలు లేవు.

స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే దేశాలు చాలా ఉన్నాయి.

ఐరాస సభ్య దేశాల్లో ఇప్పటిదాకా భారత్‌తో కలిపి 71దేశాలు స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)