‘పక్షులకు గూళ్లు కట్టాల్సిన బాధ్యత మనదే’

చెట్టు తొర్రలో గుడ్లగూబ

ఫొటో సోర్స్, iStock

రైతులు పంటచేలల్లో విత్తనాలు చల్లేది కేవలం తాము తినడానికి కావాల్సిన గింజల్ని పండించుకోవడం కోసమే కాదు... ప్రకృతిలోని వేర్వేరు రకాల ప్రాణుల మనుగడ కొనసాగేలా తమ వంతు దోహదం చేయడం కోసం కూడా.. పంజాబ్ రాష్ట్రంలోని గ్రామీణులు దీన్ని నమ్మటమే కాదు... అక్షరాలా పాటిస్తారు కూడా. గత కొన్నేళ్లుగా పక్షులు, జంతువులు, తదితర ప్రాణుల సహజ ఆవాసాలు నాశనమైపోవటాన్ని పంజాబ్ రైతులు గమనించారు. వాటి కోసం గూళ్లు ఏర్పాటు చేయడం ద్వారా వాటికి పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వారిలో కొందరు. సుఖ్‌చరణ్ ప్రీత్ అందిస్తున్న రిపోర్ట్.

వీడియో క్యాప్షన్,

వీడియో: గుడ్లగూబలకు నిలువ నీడ లేకుండా పోయింది

ఇసుక దిబ్బలు పూర్తిగా కనుమరుగయ్యాక, గుడ్లగూబలకు నిలువ నీడ లేకుండా పోయింది.

తూర్పు పంజాబ్ దాదాపు 550 రకాల పక్షులకు ఆవాసం. వాటిలో 250 రకాలు వలస పక్షి జాతులు.

దౌలా అనే గ్రామంలోని ఒక యువ బృందం పక్షి గూళ్లను తిరిగి నిర్మించే ప్రక్రియ మొదలు పెట్టింది.

‘‘అంతరించిపోతున్న పక్షుల్లో గుడ్లగూబ కూడా ఒకటి. అవి రైతులకు నేస్తాలు కూడా. ఎలుకలను, పాకే జంతువులను తింటూ గుడ్లగూబలు బతుకుతాయి. అంతేకాదు, ఎవరైనా మనుషులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ పొలాన్ని సమీపిస్తే ఇవి రైతులను అప్రమత్తం చేస్తాయి కూడా’’ అని వివరించారు పర్యావరణవేత్త సందీప్ బవ.

స్థానిక పక్షుల్లో 35 జాతులు ఇతర చిన్న చిన్న పక్షులను, ఎలుకలను, పాకే జీవాలను తింటూ బతుకుతాయి.

ఇలా తినే జీవులు, ఎరలు వంటివి ఈ సృష్టిలో ఆహార చక్రం కొనసాగడానికి చాలా ముఖ్యం.

పక్షి గూళ్లు

ఫొటో సోర్స్, iStock

2013లో మేం పక్షి గూళ్లను ఏర్పాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో సంవత్సరానికి 50 దాకా ఏర్పాటు చేసేవాళ్లం. ఇప్పుడు 300 దాకా చేస్తున్నాం. పరిసర గ్రామాల్లో కూడా చేస్తున్నాం. అడవులు వేగంగా నాశనమైపోతుంటే, దానికి పరిహారంగా మేమే ఈ అడవిని పెంచాం’’ అని సందీప్ బవ తెలిపారు.

పక్షులకు మూడు అవసరాలు ఉంటాయి - ఆహారం, నివాసం, గుడ్లు పొదిగే ప్రదేశం.

పాత ఆవాసాలు ధ్వంసమైపోయాయి కాబట్టి ఈ పక్షులను కాపాడాలంటే కొత్త వాటిని నిర్మించాల్సిందే.

‘‘గతంలో ఇసుక దిబ్బలు, చిన్న గోతులు వీటికి ఆవాసంగా ఉండేవి. ఇప్పుడు ఇవి రెండూ కనుమరుగైపోయాయి. అందుకే కొత్త ఆవాసాలను నిర్మించాలి. అవే పక్షి గూళ్లు. అప్పుడే ఆ పక్షుల మనుగడ సాధ్యమవుతుంది. మానవులే పక్షుల ఆవాసాలను నాశనం చేస్తున్నారు కాబట్టి, మనమే వాటికి కొత్త ఆవాసాలను నిర్మించాలి’’ అని సందీప్ బవ వెల్లడించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)