ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ కష్టాలు?
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

మాకు ఇంకా ఎన్నాళ్లు మాకు ఈ కష్టాలు?

  • 12 సెప్టెంబర్ 2018

"మా ఊరికి రోడ్డు లేదు. రోగులను, గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే వారిని 6 కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకెళ్లాల్సిందే. మేం ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, మా సమస్యను ఎవరూ పట్టించుకోవడంలేదు. మా జీవితాలను బాగు చేసే రోడ్డు కోసం ఎదురుచూస్తున్నాం. ఈ వీడియో చూసైనా అధికారులు మా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం" కొద్దిరోజులుగా వాట్సాప్‌లో తిరుగుతోన్న వీడియోలో ఉత్తరాంధ్రకు చెందిన ఓ గిరిజన యువకుడి ఆవేదన ఇది.

ఈ వీడియో చిత్రీకరించిన ఆ యువకుడిది ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని యం. చింతవలస అనే గిరిజన గ్రామం.

కొండ ప్రాంతంలో ఉండే ఈ గ్రామానికి రోడ్డు లేదు. ఇక్కడ ఎవరికైనా అనారోగ్యం చేసినా, పురిటి నొప్పులతో బాధపడుతున్నా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే ఆరేడు కిలోమీటర్ల దూరం కావడిపై మోసుకెళ్లడం తప్ప తమకు మరోదారి లేదని ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా సెప్టెంబర్ 4వ తేదీన ఈ ఊరికి చెందిన ఒక గర్భిణిని అలానే తీసుకెళ్లారు. కానీ 3 కిలోమీటర్ల దూరం వెళ్లగానే దారిలోనే ఆమె ప్రసవించారు. దాంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమెను తిరిగి వాళ్ల గ్రామానికే తీసుకెళ్లారు.

ఆమె ప్రసవిస్తున్న సమయంలో రోడ్డు లేకపోవడంతో తమ గ్రామస్తులు పడుతున్న కష్టాలను వివరిస్తూ ఆ యువకుడు వీడియో తీశాడు. ప్రసవం అనంతరం రాయితో శిశువు బొడ్డుతాడును కోయడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)