ఆమె చిన్న పిల్ల కాదు.. అన్ని రోజులు వేధిస్తుంటే చూస్తూ ఎలా ఉంటారు? నన్ను కావాలనే ఇరికిస్తున్నారు : బిషప్ ఫ్రాంకో

  • 13 సెప్టెంబర్ 2018
నిరసనల్లో పాల్గొన్న నన్స్
చిత్రం శీర్షిక నిరసనల్లో పాల్గొన్న నన్స్

కేరళకు చెందిన ఫ్రాంకో ములక్కల్ అనే బిషప్ తనను లైంగికంగా వేధించారని ఒక నన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 మే నుంచి 2016 సెప్టెంబరు మధ్య అనేకసార్లు బిషప్ తనను లైంగికంగా వేధించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కానీ, బిషప్ ఫ్రాంకో ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ‘అవి ఒట్టి అబద్దాలు, కట్టు కథలు. ఫిర్యాదు చేసిన మహిళ చిన్న పిల్ల కాదు. అన్ని రోజులు పాటు వేధిస్తుంటే ఆమె చూస్తూ ఎలా ఉంటారు?’ అని బీబీసీతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

పంజాబ్‌లోని జలంధర్ డైసిస్‌కు ఆయన బిషప్‌గా ఉన్నారు. చర్చిల్లో బిషప్‌ది చాలా ఉన్నత స్థానం. దేశంలో మొత్తం 144 డైసిస్‌లకు గాను 145 మంది బిషప్‌లు ఉన్నారు.

ఆ నన్‌పైన ఉన్న వేరే ఫిర్యాదుపై తాను విచారణ చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని బిషప్ ఫ్రాంకో పేర్కొన్నారు.

మరోపక్క ఈ కేసు విషయంలో పోలీసులు స్పందించట్లేదని ఆరోపిస్తూ కేరళలో కొందరు నన్స్ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి క్యాథలిక్ లాటిన్ చర్చితో పాటు స్థానికులు కూడా మద్దతు తెలుపుతున్నారు. కానీ, జలంధర్‌కు చెందిన ‘మిషనరీస్ ఆఫ్ జీసస్’ ఆ నన్స్‌ను నిరసనల్లో పాల్గొనద్దని కోరింది.

పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు బిషప్ ఫ్రాంకో తనను రేప్ చేశారని ఆరోపిస్తూ ఆ నన్ చర్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ తనను పట్టించుకోలేదని ఆమె చెప్పారు.

బహిరంగంగా నిరసనలు ప్రారంభించడానికి ముందు ఆమె ఈ ఏడాది జనవరి, జూన్, సెప్టెంబర్ నెలల్లో దిల్లీలోని పోప్ ప్రతినిధులకు లేఖ రాసినట్లు వివరించారు.

పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ జార్జ్ జోసెఫ్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ‘బిషప్‌ను వెంటనే అరెస్టు చేయాలి. హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలి. ఆ బిషప్ దేశం వదిలి వెళ్లకుండా చూడాలి’ అని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము నిందితుడి విషయంలో ఆధారాలు సేకరించామని, కానీ ఈ కేసులో ఆచితూచి అడుగేయమని కోర్టు తమకు సూచించిందని పోలీసులు కేరళ హైకోర్టుకు తెలిపారు.

మరోపక్క బిషప్ మాట్లాడుతూ... ‘ఆ నన్‌‌కు మరో వ్యక్తితో సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దానిపైన నేను విచారణ జరుపుతున్నా. తన కేసు నుంచి దృష్టి మరల్చేందుకే ఆమె అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు’ అని అన్నారు.

ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ... ‘బాధితురాలిపై చేస్తున్న అసత్య ఆరోపణలు ఇవి. ఒకవేళ తన కుటుంబ జీవితం బాలేకపోతే, ఆమె ఇంకా ఎందుకు కుటుంబంతోనే ఉంటుంది?’ అని కేరళలో నిరసనలకు నాయకత్వం వహిస్తున్న అనుపమ చెప్పారు

‘నిందితుడిని పోలీసులు అరెస్టు చేయక తప్పదు. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా బిషప్‌కు వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయని పోలీసులు పేర్కొన్నారు’ అని కేరళ హైకోర్టు మాజీ జడ్జి కేమల్ పాషా అభిప్రాయపడ్డారు.

బిషప్‌ ఫ్రాంకో సెప్టెంబర్ 19న పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోరుతూ కొట్టాయం పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: పది లక్షలు దాటిన కరోనా వైరస్ నిర్థరిత కేసులు.. ఒక్క అమెరికాలోనే సుమారు 2.5 లక్షల కేసులు

‘‘కరోనావైరస్ కేసులు, మరణాలపై నిజాలు దాస్తే ప్రమాదం’’ – సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

కరోనావైరస్: కుక్కలు, పిల్లుల మాంసం తినడంపై నిషేధం విధించిన చైనా నగరం

కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే.. ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి

కరోనావైరస్: కాలినడకన ఇంటికి తిరిగి వెళ్తూ చనిపోయిన డెలివరీ మ్యాన్ చివరిసారి ఏం చెప్పాడు

కేసీఆర్ చెప్పినా ఆగని వలసలు

లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోందా?

డేనియల్ పెర్ల్ హత్యకేసులో దోషికి మరణశిక్షను రద్దుచేసిన పాకిస్తాన్

మద్యం దొరక్క మందుబాబుల వింత ప్రవర్తన, ఎర్రగడ్డ ఆస్పత్రికి పెరిగిన రద్దీ