వీడియో: బికినీల వల్లే చాలామంది అమ్మాయిలు బాడీ బిల్డింగ్‌ను ఎంచుకోవట్లేదు- బినల్ రాణా
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.

వీడియో: బికినీల వల్లే చాలామంది అమ్మాయిలు బాడీ బిల్డింగ్‌ను ఎంచుకోవట్లేదు- బినల్ రాణా

  • 16 సెప్టెంబర్ 2018

గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరానికి చెందిన ఓ మహిళ బాడీ బిల్డింగ్‌లో పేరు తెచ్చుకున్నారు. ఇందుకోసం ఆమె శారీరకంగా శ్రమించడంతో పాటు మానసికంగానూ చాలా కష్టపడాల్సి వచ్చింది.

బినల్ రాణా నేషనల్ కాంపిటిషన్‌లో గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించారు. పోటీల్లో ఆమె బికినీలు ధరించడంపై కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతోంది.

పురుషులతో పోలిస్తే బాడీ బిల్డింగ్‌లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అందుకే మహిళా బాడీ బిల్డర్‌గా ఆమె చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. మొట్టమొదట తన కుటుంబం నుంచే సమస్యలు మొదలయ్యాయి.

మొదట్లో బినల్ రాణా బికినీ ధరించి పోటీల్లో పాల్గొనడం ఆమె కుటుంబ సభ్యులకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆఖరుకు ఆమె ఇంట్లోంచి వెళ్లిపోవాల్సి కూడా వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)