ఆడవారిని మగవారుగా, మగవారిని ఆడవారుగా ఎలా మార్చుతారు?

ట్రాన్స్‌జెండర్లు

ఫొటో సోర్స్, Getty Images

లింగ మార్పిడి ఎలా జరుగుతుంది? అమ్మాయి అబ్బాయిగా లేదా అబ్బాయి అమ్మాయిగా ఎలా మారతారు?... ఇలాంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి.

లింగ మార్పిడి చికిత్సను ఇంగ్లిష్‌లో 'సెక్స్ రీఎసైన్‌మెంట్ సర్జరీ' అంటారు. సాధారణంగా ట్రాన్స్‌జెండర్లకు ఈ ఆపరేషన్ అవసరమవుతుంది.

'లైంగిక అవయవాలు', లైంగికత వేర్వేరుగా ఉన్నవారిని ట్రాన్స్‌జెండర్లు అంటారు. ఈ శస్త్రచికిత్స చేయడానికి ముందు వారికి 'జెండర్ డిస్ఫోరియా' ఉందో లేదో చూస్తారు.

అంటే... వారు శరీర తత్వానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరీక్షిస్తారు.

'జెండర్ డిస్ఫోరియా'ను నిర్థరించేందుకు సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం కావాలి. జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లయితే మొదట హార్మోనల్ థెరపీ చేస్తారు. మందులు, ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి హార్మోన్లను ఎక్కిస్తారు. ఆ తరువాత సర్జరీకి సిద్ధం చేస్తారు.

కనీసం 20 ఏళ్ల వయసు దాటాకే ఈ చికిత్స చేస్తారు. అంతకంటే తక్కువ వయసుంటే, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.

లింగమార్పిడి ఆపరేషన్‌కు 5-6గంటల సమయం పడుతుంది. ఇందులో భాగంగా వక్షోజాలు, జననాంగం, ముఖానికి శస్త్రచికిత్స చేస్తారు. దీని కోసం ప్లాస్టిక్ సర్జన్, సైకియాట్రిస్ట్, గైనకాలజిస్ట్‌తో పాటు న్యూరాలజిస్ట్ కూడా కావాలి.

ఆపరేషన్ తరువాత మళ్లీ ఏడాదిపాటు హార్మోనల్ థెరపీ చేస్తారు.

ఆడవాళ్లను మగవాళ్లుగా మార్చే చికిత్సకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కోసం రూ.10-20 లక్షలు ఖర్చవుతాయి.

వీడియో క్యాప్షన్,

లింగ మార్పిడి ఎలా చేస్తారు?

ఇవి కూడా చదవండి

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)