బిగ్‌బాస్-2: విజేత కౌశల్ అసలు కథ

  • 30 సెప్టెంబర్ 2018
kaushal Image copyright kaushal

కౌశల్.. తెలుగు బిగ్‌బాస్-2 విజేత. హౌస్‌లో అందరి మెప్పు పొందలేకపోయినా సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొంది గెలిచారు.

సినిమాలు, సీరియళ్లలో పలు పాత్రలు పోషించడంతో తెలుగువారికి నటుడిగా పరిచితుడైన కౌశల్ ఇప్పుడు బిగ్‌బాస్ విజేత కావడంతో ఆయన పట్ల అందరిలోనూ మరింత ఆసక్తి ఏర్పడింది.

ఈ వైజాగ్ కుర్రాడు ఆరేళ్లకే స్టేజ్ ఎక్కాడు. చిన్నతనం నుంచి నటన పట్ల ఆసక్తితో ఎదిగారు.

Image copyright kaushal

తన మనసుకు నచ్చిందే చేయడం, తాను కోరుకున్నట్లుగానే జీవించడం కౌశల్ ప్రత్యేకతలని అతనిని దగ్గరి నుంచి చూసిన వారు బీబీసీకి చెప్పారు.

కౌశల్ తండ్రి నాటక రంగ కళాకారుడు. వీరి కుటుంబం వైజాగ్‌లోని సుజాతా నగర్‌లో ఉండేది. తర్వాత హైదరాబాద్‌కి వచ్చారు.

కౌశల్ చిన్ననాటి నుంచి ఆయన నటన చూస్తూ పెరిగారు. స్కూళ్లో చదువుతున్న రోజుల నుంచి ఆయన తండ్రిలా నటుడు కావాలని తపించారు.

తొలుత మోడలింగ్‌లో అవకాశాలు అందుకున్న ఆయన అనంతరం నటుడిగా మారారు.

మారుతి కార్గో, విజయ్ టెక్స్‌టైల్స్ వంటి సంస్థ వాణిజ్య ప్రకటనలకు మోడల్‌గా పనిచేసిన ఆయన మహేశ్ బాబు చిత్రం రాజకుమారుడితో వెండితెరపై కాలుమోపారు.

బుల్లితెరపై పలు ధారావాహికల్లో కౌశల్ నటిస్తున్నారు.

200కిపైగా వాణిజ్య ప్రకటనల్లో నటించిన కౌశల్ హైదరాబాద్‌లో సొంతంగా యాడ్ ఏజెన్సీ, ప్రొడక్షన్ హౌస్ నిర్వహిస్తున్నారు.

Image copyright kaushal

'లుక్స్' పేరుతో మోడలింగ్ ఏజెన్సీని 1999లో ప్రారంభించారు కౌశల్. దక్షిణాదిలో ఇదే తొలి మోడలింగ్ ఏజెన్సీ అంటారాయన.

1999లో మిస్టర్ ఇండియా పోటీల్లో ఫైనల్ వరకు వెళ్లారు.

ప్రతి రోజూ కనీసం ఒక గంటపాటు వ్యాయామం చేయనిదే ఆయన రోజు మొదలుకాదు.

చివరగా బిగ్ బాస్ 2లో భాగంగా గెలిచిన నగదు బహుమతిని కూడా కేన్సర్ బాధితుల కోసం వినియోగిస్తానని కౌశల్ చెప్పడం విశేషం.

తన తల్లి కేన్సర్‌తో చనిపోయారు కనుక కేన్సర్ బాధితులకు ఈ నగదును ఉపయోగిస్తానని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)