నోబెల్: రసాయన శాస్త్రంలో ఎంజైముల సృష్టికి పురస్కారం

  • 3 అక్టోబర్ 2018
2018 నోబెల్ బహుమతి గ్రహీతలు Image copyright The Nobel Prize/Twitter

ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని తాజాగా ప్రకటించారు. ఎంజైములకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ వరించింది.

అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్, జార్జ్ పి స్మిత్‌లతోపాటు బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్త గ్రెగరీ వింటర్ ఈ జాబితాలో ఉన్నారు.

కొత్త ఎంజైములను సృష్టించేందుకు వీరు 'డైరెక్టెడ్ ఎవల్యూషన్' అనే పద్ధతిని ఉపయోగించారు. జీవశాస్త్రంలో రసాయనిక చర్యలు వేగంగా జరిగేందుకు వీరి పరిశోధనలు తోడ్పడతాయి. కొత్త ఔషధాలు తయారు చేయడంతోపాటు, పర్యావరణహిత ఇంధనాలు ఉత్పత్తి చేసేందుకు వీరు సృష్టించిన కొత్త ఎంజైములు ఉపయోగపడతాయి.

బహుమతి మొత్తం 9,98,618 డాలర్లు. ఇందులో సగం ఆర్నాల్డ్‌కు దక్కనుండగా, మిగతా సగాన్ని స్మిత్, వింటర్ పంచుకోనున్నారు.

Image copyright GAVIN MURPHY/NATURE/SCIENCE PHOTO LIBRARY
చిత్రం శీర్షిక క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ద్వారా గుర్తించిన బ్యాక్టీరియా మోటార్

రసాయన శాస్త్రంలో గత నోబెల్ విజేతలు:

2017: జీవ అణువుల అభివృద్ధి, ఒకదానితో మరొకటి అనుసంధానమయ్యే తీరు వంటి వాటిని చూడగల 'క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ' అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు జాక్వస్ డబోషెట్, జోచిమ్ ఫ్రాంక్, రిచర్డ్ హెండర్సన్‌లకు నోబెల్ లభించింది.

2016: ప్రపంచంలోనే అతి చిన్న యంత్రాన్ని తయారు చేసిన జీన్ పియెర్రా సావేజ్, ఫ్రేజర్ స్టాడర్ట్, బెర్నార్డ్ ఫెరింగాలకు నోబెల్ లభించింది. ఈ అతి చిన్న యంత్రాలు మానవుని శరీరంలోకి ఔషధాలను తీసుకుని వెళ్తాయి.

2015: దెబ్బతిన్న డీఎన్‌ఏను శరీరం కణాల ద్వారా సరి చేసే విధానాన్ని కనుగొన్న థామస్ లిండా, పాల్ మోడ్రిచ్, అజీజ్ సన్కార్‌లను నోబెల్ వరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ముఖ్యమైన కథనాలు

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు

ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి