వర్ణాంతర వివాహం: ఆఫ్రికా అబ్బాయి, ఇండియా అమ్మాయి.. ఓ అందమైన ప్రేమ కథ

  • 11 అక్టోబర్ 2018
సిమో, ఎలైన్

దక్షిణాఫ్రికాలో వర్ణాంతర వివాహాలపై నిషేధం తొలగిపోయి దాదాపు పావు శతాబ్దం గడిచాక శరీరం రంగులు భిన్నంగా ఉన్న వారి మధ్య పెళ్లిళ్లు జరుగుతున్నాయా? కులమతాల పట్టింపులు ఎక్కువగా ఉండే భారత సంతతి ప్రజలు స్థానిక నల్లజాతి దక్షిణాఫ్రికన్లతో వియ్యం అందుకుంటున్నారా?

బీబీసీ ప్రతినిధులు జుబేర్ అహ్మద్, నేహా శర్మ దక్షిణాఫ్రికాలో పర్యటించి ఈ రెండు సముదాయాల మధ్య వివాహ సంబంధాల అంశాన్ని పరిశీలించారు. వీరు అందిస్తున్న కథనం ఇది.

ఎలైన్ , సిమోలది ఓ అందమైన ప్రేమ కథ. ఎలైన్ భారత్‌కు చెందిన హిందూ యువతి. సిమో జూలూ ఆఫ్రికన్.

''ఎందుకో తెలియదుగానీ ఆయన నాకు ప్రత్యేకంగా అనిపించారు. 'నువ్వంటే నాకిష్టం' అని చెప్పాలనుకున్నపుడు 'నీ బూట్లంటే నాకిష్టం' అని చెప్పాను. రెండేళ్ల పాటు డేటింగ్, 12 ఏళ్ల వివాహం బంధం… ఇప్పుడు మేం ఇలా సంతోషంగా ఉన్నాం'' అని ఎలైన్ వివరించారు.

తాము చాలా సంతోషంగా ఉన్నామని సిమో చెప్పారు.

వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గురు పిల్లలున్నారు.

ఎలెన్, సిమో ఒకరి సంస్కృతిని మరొకరు అర్థం చేసుకున్నారు. గౌరవించుకున్నారు.

చిత్రం శీర్షిక ఎలైన్, సిమో ఒకరి సంస్కృతిని మరొకరు అర్థం చేసుకున్నారు. గౌరవించుకున్నారు.

1985 వరకు దక్షిణాఫ్రికాలో వర్ణాంతర వివాహాలపై నిషేధం ఉండేది. నిషేధాన్ని ఎత్తివేసిన రెండు దశాబ్దాల తర్వాత కూడా వీరి వివాహం సాహసోపేతమైన అడుగనే చెప్పాలి.

సిమోను పెళ్లి చేసుకొంటానని చెప్పినప్పుడు ఎలైన్‌కు ఆమె కుటుంబం నుంచి గట్టి వ్యతిరేకత ఎదురైంది.

''మా అమ్మ నా గురించి చాలా భయపడ్డారు. 'ఇలా పెళ్ళి చేసుకున్న చాలా మంది భారతీయులు మోసపోయారు. నల్లజాతీయులను ఎలా పెళ్ళి చేసుకుంటావు? భారతీయులను చేసుకోవచ్చు కదా' అన్నారు'' అని ఎలైన్ గుర్తు చేసుకున్నారు.

ఎలైన్, సిమో వెనక్కు తగ్గలేదు. కలిసి కష్టాల్ని ఎదిరించారు.

''మా జీవితాల్లో ఎదుర్కొన్న ఒడిదొడుకులే మా ఇద్దరినీ మరింత దగ్గర చేశాయి. మా ఇద్దరికి కనీసం ఉద్యోగం కూడా లేదు. ఆఖరుకు మా పిల్లలతో కలిసి ఓ గుడారంలో బతకాల్సి వచ్చింది'' అని సిమో తెలిపారు.

''నేను జూలూ జాతికి చెందిన అమ్మాయిని కాదు కాబట్టి వాళ్ల సంస్కృతిని నేను పాటించలేనేమోనని సిమో వాళ్ల అమ్మ కాస్త భయపడ్డారు. కానీ నేను వారి ఆచార వ్యవహారాలన్నీ చాలా ఉత్సాహంగా నేర్చుకున్నాను'' అని ఎలైన్ చెప్పారు.

సిమో స్పందిస్తూ- ''నాకు భజనలంటే ఏంటో తెలియదు. అందుకే భజనలకు వెళ్లేవాడిని. తనకు అవి నచ్చాయి కూడా'' అన్నారు.

ఆయన బాలీవుడ్ పాటలు కూడా నేర్చుకున్నారు. ఎలైన్‌కు జూలూ సంగీతం పెద్దగా అలవాటు కాలేదు.

భవిష్యత్తులో వర్ణాంతర వివాహాలు చేసుకునే వారికి కష్టాలు ఎదురుకాకూడదని ఎలైన్, సిమోలిద్దరూ కోరుకుంటున్నారు.

''చర్మం రంగును కాకుండా మనుషుల పేర్లను మాత్రమే ప్రపంచం పట్టించుకుంటే బాగుంటుందనిపిస్తుంది. ఎందుకంటే, మనుషుల్ని కలిపి ఉంచేది ప్రేమ ఒక్కటే'' అని ఎలైన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: తుపాకీ పట్టుకుని పోలీసులపై కాల్పులు జరుపుతున్న ఈ వ్యక్తి ఎవరు?

డోనల్డ్ ట్రంప్: ముగిసిన రెండు రోజుల భారత పర్యటన

ఇరాన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రికి కరోనావైరస్.. స్పెయిన్‌లో వందల మందిని లోపలే ఉంచి హోటల్‌ను మూసేసిన ప్రభుత్వం

BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం

దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు.. ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు

దిల్లీ: హింసాత్మక ఘర్షణల్లో 13కి చేరిన మృతుల సంఖ్య

కరోనా వైరస్ రోగులకు సేవలు అందిస్తున్న గర్భిణీ - ప్రభుత్వ మీడియాపై తీవ్ర విమర్శలు

మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్