#MeToo: తనుశ్రీ దత్తా... ‘బాలీవుడ్‌లో మరెందరో నాలాగే గళం విప్పుతారు ’

  • 13 అక్టోబర్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionనాలాగే మరింత మంది గళం విప్పుతారు

బాలీవుడ్‌లో వేధింపులు ఎదుర్కొన్న మహిళలు తనలాగే మాట్లాడటానికి ముందుకు వస్తారని నటి తనుశ్రీ దత్తా అన్నారు.

పదేళ్ల కిందట సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె బీబీసీతో పంచుకున్నారు.

''పదేళ్ల కిందట ఓ బాలీవుడ్ పాట చిత్రీకరణ సమయంలో వేధింపులకు గురయ్యాను. దాని గురించి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సంఘటన చేసిన గాయం నన్ను చాలాకాలం వెంటాడింది. దాంతో సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.'' అని చెప్పారు.

వేధింపులపై తనుశ్రీ మాట్లాడటం మొదలుపెట్టాక చాలా మంది మహిళలు వారు ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు.

అయితే, తనుశ్రీ చేసిన ఆరోపణలను నటుడు నానా పాటేకర్ కొట్టిపారేశారు. ఆ సినిమా సెట్లో పదుల సంఖ్యలో జనాలు ఉన్నారని చెప్పారు. ఆమెను చట్ట ప్రకారం ఎదుర్కొనే అవకాశాలను పరిశీలిస్తున్నానన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)