నెయిల్ ఎక్స్టెన్షన్: గోళ్లను అతికించుకోవడం ఇప్పుడో ట్రెండ్

వ్యాయామం చేయకుండా శరీరంలో ఒక ఆకృతిలోకి తెచ్చుకోగలిగేది గోళ్లను మాత్రమే. కానీ, వాటిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవాలంటే చాలా కష్టపడాలి. ఆ సమస్యను దూరం చేసేందుకు 'నెయిల్ ఎక్స్టెన్షన్' అనే కొత్త ట్రెండ్ వచ్చింది.
ఈ గోళ్ల పొడిగింపులో భాగంగా మొదట గోళ్లను కత్తిరిస్తారు. తరువాత వాటిని ఒక ఆకారంలోకి తెచ్చి, శుభ్రం చేస్తారు. ఆపైన అసలైన గోళ్ల పొడిగింపు ప్రక్రియ మొదలవుతుంది. ఉన్న గోళ్లకు జెల్ లేదా ఆక్రిలిక్ గోళ్లను అతికిస్తారు.
మామూలుగా గోళ్లను కత్తిరించి, వాటికి పెయింట్ వేసి, ఓ ఆకృతిలో ఉంచుకోవడానికి చాలా శ్రమపడతారు. కానీ, ఈ పద్ధతిలో ఒక్కసారి గోళ్లను పొడిగించుకున్నాక నెల రోజుల దాకా వాటి గురించి ఆలోచించక్కర్లేదు.
ఈ గోళ్ల ఎక్స్టెన్షన్కు రూ.1000-5000 దాకా ఖర్చవుతుంది.
కానీ, దీని వల్ల చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు సైతం చెబుతున్నారు.
‘గోళ్ల ఎక్స్టెన్షన్ వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలూ ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ రావొచ్చు. నీళ్లు, మురికి లాంటివి పొడిగించుకున్న గోళ్లలో ఇరుక్కుపోయి, అసలు గోరును దెబ్బతీయొచ్చు. ఇతర వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఎదురయ్యే ప్రమాదమూ ఉంది. అవి సులువుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి’ అని డా.రాహుల్ అరోరా చర్మ వైద్యుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కాఫీ పైన సెల్ఫీ... మీకూ కావాలా?
- అభిప్రాయం: మోదీ సర్కారుపై అక్బర్ రాజీనామా ప్రభావమెంత?
- రాధ: పుట్టిన కాసేపటికే సెలెబ్రిటీ అయిపోయింది
- తిత్లీ తుపాను: 2,25,000 కుటుంబాలపై తీవ్ర ప్రభావం
- రామ్లీల: ‘సంపూర్ణ రామాయణాన్ని’ తొలిసారి ప్రదర్శించింది ఇక్కడే
- రామేశ్వరం: మందిరమైనా.. మసీదైనా.. లోపలికెళితే ఒకేలా ఉంటాయిక్కడ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)