అమృత్‌సర్ రైలు ప్రమాదం: ఒకపక్క రావణ దహనం.. మరోపక్క రావణ పాత్రధారి దుర్మరణం

  • 20 అక్టోబర్ 2018
రావణుడి వేషంలో దల్బీర్ సింగ్
చిత్రం శీర్షిక రావణుడి వేషంలో దల్బీర్ సింగ్

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జోడా ఫాటక్ వద్ద శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం మృతుల్లో ఒకరైన దల్బీర్ సింగ్ అక్కడ నిర్వహించిన రామ్‌లీలా ప్రదర్శనలో రావణుడి వేషం వేశారు. తర్వాత రావణ దహనాన్ని చూసేందుకు రైలు పట్టాల వద్దకు వెళ్లారు. ఇంతలో ప్రమాదం సంభవించింది.

శనివారం మధ్యాహ్నం వరకున్న సమాచారం ప్రకారం ఈ విషాదంలో 58 మంది చనిపోయారు. దసరా వేడుకల్లో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటైంది.

శనివారం తెల్లవారుజామున దల్బీర్ సోదరుడు బల్బీర్ సింగ్ ప్రమాద స్థలిలో కనిపించారు. ప్రమాద స్థలంలో తమ ఆత్మీయుల జాడ కోసం వెతుకుతున్న చాలా మందిలో ఆయన ఒకరు.

చిత్రం శీర్షిక దల్బీర్ సింగ్

బాధిత కుటుంబాల వారు మొబైల్ ఫోన్ల టార్చి వేసి రైల్వే పట్టాల దగ్గర వెతుకుతున్నారు. వీరిలో ఒకరైన ఉష తన సమీప బంధువైన ఆశీస్ కోసం ఆస్పత్రులకు వెళ్లి చూశారు. అక్కడ కనిపించకపోవడంతో ఘటనా స్థలికి వచ్చి వెతుకుతున్నారు. ప్రమాదంలో ఆశీష్ పొదల్లో ఏమైనా పడిపోయాడా అని అక్కడ చూస్తున్నారు.

మంజిత్ సింగ్ అనే వ్యక్తి ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన అంకుల్ అజిత్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు అప్పుడు రావణుడి బొమ్మ దహనాన్ని చూస్తూ రైలు పట్టాలు దాటుతున్నారు. దూసుకొస్తున్న రైలును చూసి మంజిత్ తక్షణం ఒక్క ఉదుటున పట్టాల మీద నుంచి పక్కకు దూకేశారు. అజిత్ సింగ్ అలా దూకలేకపోయారు. స్నేహితుడి సాయంతో మంజిత్ ఆయన్ను ద్విచక్ర వాహనంపై గురు నానక్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అజిత్ సింగ్ అప్పటికే చనిపోయారని వైద్యులు తెలిపారు.

చిత్రం శీర్షిక రావణ దహనం జరిగిన ప్రదేశం

దల్బీర్‌ గాలిపటాల తయారీదారుడని, ఆయనకు నటనంటే బాగా ఆసక్తి అని బల్బీర్ బీబీసీతో చెప్పారు. దల్బీర్ ఎప్పుడూ రాముడి వేషం వేసేవారని, స్నేహితుల ఒత్తిడి మేరకు ఈసారి తొలిసారిగా రావణుడి వేషం వేశారని బల్బీర్ వివరించారు.

''ప్రదర్శనలో చివరి అంకం పూర్తయిన తర్వాత దల్బీర్ వేదిక దిగి వచ్చారు. విల్లు తీసుకొని రావణ దహనాన్ని చూసేందుకు రైలు పట్టాల వద్ద ఉన్న గుంపుతో కలిశారు'' అని బల్బీర్ తెలిపారు.

ప్రదర్శన జరిగిన వేదికకు, రైలు పట్టాలకు మధ్య దూరం దాదాపు 25 మీటర్లు.

దల్బీర్‌కు భార్య, కుమార్తె ఉన్నారు.

చిత్రం శీర్షిక రైల్వే ట్రాక్

అజిత్ సింగ్ దసరా వేడుకలకు తనను ఆహ్వానించారని మంజిత్ సింగ్ తెలిపారు. మంజిత్‌ది కూడా అమృత్‌సరే. ఆయన హాల్‌బజార్‌లో దుకాణదారు. అజిత్ సింగ్ వెల్డింగ్ పనులు చేస్తుంటారు.

ఆ రైల్వే ట్రాక్‌పై నుంచి అయితే రావణ దహనం బాగా కనిపిస్తుందనే ఉద్దేశంతో వారు అక్కడకు వెళ్లి నిలబడ్డారు. ''బాణసంచా పేలుళ్ల భారీ శబ్దాలు, పండగ సందడితో రైలు వస్తున్న శబ్దం మాకు వినిపించలేదు. నేను చివరి క్షణంలో రైలును చూడటం వల్ల పక్కకు దూకి తప్పించుకోగలిగాను'' అని మంజిత్ వివరించారు. అప్పటివరకు వేడుక జరిగిన ప్రాంతం కాస్తా క్షణాల్లో మారిపోయింది. తెగిపడ్డ శరీర అవయవాలు, రక్తపు మరకలతో భయానకంగా కనిపించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: దసరా వేడుకల్లో అపశృతి: అమృత్‌సర్‌లో 58 మంది మృతి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్: 'సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా తిరగబడ్డారు' - సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్

ప్రెస్‌రివ్యూ: అత్త,మామల సంరక్షణలో అల్లుళ్లు, కోడళ్లకూ బాధ్యత.. విస్మరిస్తే జైలు, జరిమానా

దిశ అత్యాచారం, హత్య: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు... నలుగురు అరెస్ట్

గద్దర్: ‘తెలంగాణ ప్రభుత్వంలో టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’

అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ

టైఫాయిడ్ వాక్సిన్: 'అద్భుతంగా పనిచేస్తోంది'

పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది... ఎవరు వ్యతిరేకిస్తున్నారు

వాతావరణ మార్పుతో పక్షులు కుంచించుకుపోతున్నాయి: అధ్యయనంలో వెల్లడి