వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై దాడి: శ్రీనివాస రావు ఎవరు? ఎందుకు దాడి చేశాడు?

  • 25 అక్టోబర్ 2018
నిందితుడు Image copyright BBC/Ugc

విశాఖ విమానాశ్రయంలో ఏం జరిగింది అనే అంశంపై వైజాగ్‌ వెస్ట్ ఏసీపీ అర్జున్, ఏడీసీపీ పాత్రుడు విలేకర్లతో మాట్లాడారు.

నిందితుడు తూర్పుగోదావరి జిల్లా, ముమ్మడివరం మండలం, ధనియాలపాలేనికి చెందిన జె.శ్రీనివాస్‌గా గుర్తించామని తెలిపారు. ఆయన వైసీపీ అభిమానని వివరించారు.

వైజాగ్ విమానాశ్రయం సీఎస్ఎఫ్ సెక్యురిటీ పరిధిలో ఉందని.. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

సిట్ దర్యాప్తులో మిగతా వివరాలు తెలుస్తాయని చెప్పారు.

నిందితుడు శ్రీనివాస్ వయసు 30 ఏళ్లు ఉంటాయని వెల్లడించారు.

Image copyright ugc
చిత్రం శీర్షిక సెల్ఫీ తీసుకుంటానని చెప్పి దగ్గరకు వచ్చిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్ పై 12.34 నిమిషాలకు దాడి జరిగిందని.. ఆయన జగన్‌పై దాడి చేసిన వెంటనే పోలీసులు.. అక్కడున్నవారు అతన్ని అదుపులోకి తీసుకున్నారని వివరించారు.

పాపులారిటీ కోసం శ్రీనివాస్ ఈ దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

Image copyright Chandrakanth

24 గంటల పాటు విశ్రాంతి అవసరం

విశాఖ విమానాశ్రయంలో కత్తిపోటుకు గురైన జగన్ కు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

ఆయన ఎడమ భుజంపై ఉన్న గాయానికి తొమ్మిది కుట్లు వేశారు.

జగన్ రక్త నమూనాలను పరీక్షిస్తున్నారు. 24 గంటల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు వైద్యులు సూచించినట్టు సమాచారం.

మరోవైపు ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాుటు చేశారు. ఆసుపత్రికి జగన్ బంధువులంతా చేరుకున్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: జగన్‌పై దాడి కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా క్వారంటైన్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సాంకేతికతను ఎలా వాడుతున్నాయి?

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు

కరోనా వైరస్: 24 గంటల్లో 525 కొత్త కేసులు.. భారత్‌లో 3,072కి పెరిగిన పాజిటివ్ కేసులు

హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?

కరోనావైరస్ సంక్షోభం: సమానత్వ, న్యాయ మూలాలపై సరికొత్త సమాజాన్ని నిర్మించేందుకు ఇది సదవకాశమా

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణీ స్త్రీలు, రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

వివిధ దేశాల్లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలు: ‘ఆడవాళ్లు బయటకు వచ్చే రోజు మగవాళ్లు రాకూడదు.. భార్యలు భర్తల్ని విసిగించొద్దు’

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: అమెరికా చేసిన తప్పులేంటి... ఒప్పులేంటి?