రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ: ‘కాంగ్రెస్‌తో చేయి కలపడం ప్రజాస్వామిక అనివార్యత'

ఫొటో సోర్స్, facebook
దేశంలోని అన్ని ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తోన్న బీజేపీని గద్దెదింపి, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు భావసారూప్య పార్టీలతో కలుస్తున్నామని టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
దిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమకు పదవులు ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పైనే ఉంటుందని రాహుల్ గాంధీ ప్రకటించడం ఇందుకు ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు.
‘‘బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే అన్ని పార్టీలతో కలుస్తాం. నాయకుడిగా ఎవరుండాలనదే ముఖ్యం కాదు. దేశమే మా తొలి ప్రాధాన్యం’’ అని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికే ఆయన ఈ విషయమై శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలతో చర్చించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ‘‘గతం గురించి ఆలోచించడం లేదు ప్రస్తుత పరిణామాల గురించి ఆలోచిస్తున్నాం. మాకు పదవులు ముఖ్యం కాదు బీజేపీని గద్దె దించేందుకు కలిసిపోరాడాలని నిర్ణయించాం’’ అని చెప్పారు.
'దేశాన్ని రక్షిద్దాం... ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం' అనే నినాదంతో చంద్రబాబు ఇప్పటికే బీఎస్పీ అధినేత మాయావతి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాతో పాటు ఇతర పార్టీ నేతలను కలిశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పైనే ఉంటుందని రాహుల్ గతంలోనే ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కలసిపోటీ చేయనున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు భేటీ కావడం రాజకీయం ప్రాముఖ్యం సంతరించుకుంది.
ఫొటో సోర్స్, facebook
‘ప్రజాస్వామిక అనివార్యత పేరుతో ఏకమవుతున్నారు’
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి రాహుల్, చంద్రబాబు కలయికతో మరోమారు స్పష్టం అయింది. దీనికి బాబు వాడిన 'డెమోక్రాటిక్ కంపల్షన్' (ప్రజాస్వామ్య అనివార్యత) అనే పదప్రయోగం అద్దం పడుతోంది’ అని సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు విశ్లేషించారు.
‘‘ఒక ప్రధాన ఉమ్మడి రాజకీయ ప్రత్యర్ధిని ఎదుర్కోవడానికి ప్రత్యర్ధులు ఏకం కావడం అనే రాజకీయ ప్రయోగం మరోసారి భారత రాజకీయ యవనిక మీదకు వచ్చింది. గతంలో ఈ రూపేణా జరిగిన ప్రయోగాలన్నీ సఫలం కాని మాట నిజమే అయినా, అన్నిసార్లు ఆలానే జరగాలని లేదు. రాజనీతిలో తప్పొప్పులు ఎంచడం అనేది పార్టీలు ఏనాడో మరచిపోయాయి. ఏది చేసినా దాన్ని సమర్ధించుకునేందుకు నాయకులు ఏవో కారణాలు చెబుతూనే వుంటారు. ఇప్పుడు అలాంటిదే రాహుల్, బాబు మాటల్లో వ్యక్తం అయింది’’ అని అన్నారు.
రాహుల్, చంద్రబాబు చర్చలు మరో కొత్త రాజకీయ సమీకరణాలకి దారి తీస్తాయా, వీరితో మరికొంతమంది మోదీ వ్యతిరేకులు చేయి కలుపుతారా అనేది వేచి చూడాలని భండారు చెప్పారు.
ఇవి కూడా చదవండి
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- పాకిస్తాన్ దేశ చరిత్రలోనే కటిక చీకటి రాత్రి
- సెల్ఫీ ‘వెనుక’ ఇంత కథ ఉందా?
- రష్యా అమ్మాయిల మనసు దోచుకోవడం ఎలాగో తెలుసుకోవాలనుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)