ఫేక్ న్యూస్: అస్సాంలో ఆ ఇద్దరు యువకులు నకిలీ వార్తలకు ఎలా బలయ్యారు?

వీడియో క్యాప్షన్,

ఫేక్ న్యూస్‌ మృతులు

సోషల్ మీడియాలో విస్తరిస్తున్న ఫేక్ న్యూస్ ద్వారా భారత్‌లో మూకదాడులు పెరుగుతున్నాయి. 2018లో జరిగిన మూకదాడుల్లో 29 మంది మరణించారు.

ఈ దాడుల్లో మరణించినవారిలో చాలా మందిపై.. పిల్లల్ని ఎత్తుకెళుతున్నారనే కారణంతోనే దాడి చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్, వాట్సాప్‌లు వచ్చేశాయి కానీ చాలామంది ప్రజలకు డిజిటల్ రంగం పట్ల అవగాహన లేకపోవడంతో వాట్సాప్‌లో వచ్చిన ప్రతీదీ నిజమే ప్రజలు నమ్ముతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆవిధంగా పిల్లలను ఎత్తుకెళ్లడానికి వచ్చారంటూ వ్యాపించిన నకిలీ వార్త ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. అస్సాం రాష్ట్రం గువాహటిలో జరిగిన ఈ సంఘటన వివరాలను వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)