సిజేరియన్ తరువాత సాధారణ ప్రసవం సాధ్యమేనా?

  • 2 నవంబర్ 2018
బాబు

ఒకసారి సిజేరియన్ జరిగాక మళ్లీ సాధారణ ప్రసవం జరిగే అవకాశం ఉంటుందో లేదోనని కొందరికి సందేహం కలుగుతుంది. కానీ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సిజేరియన్ తరువాత సాధారణ డెలివరీ సాధ్యమేనంటున్నారు వైద్యులు.

దిల్లీలో ఉండే సీమా గుప్తా అనే మహిళ ముగ్గురు పిల్లల తల్లి. ఆమెకు మొదట సాధారణ ప్రసవం అయింది. తరువాత సిజేరియన్, ఆ పైన మళ్లీ నార్మల్ డెలివరీ జరిగింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: సిజేరియన్ తరువాత సాధారణ ప్రసవం సాధ్యమేనా?

‘సిజేరియన్‌కు, సాధారణ ప్రసవానికి చాలా తేడా ఉంది. నా రెండో కాన్పు సమయంలో సిజేరియన్ జరిగింది. మూడోసారి నేను గర్భం దాల్చినప్పటి నుంచి సమస్య మొదలైంది. నేను మళ్లీ సిజేరియన్ చేయించుకోవాల్సి రావొచ్చని వైద్యులు భావించారు. కానీ, మేం రెండో అభిప్రాయం తీసుకున్నాం.

అదృష్టవశాత్తూ మూడోసారి నార్మల్ డెలివరీ అయ్యాక చాలా సంతోషంగా ఉంది. రెండోసారి సి-సెక్షన్ జరిగాక నా బిడ్డను సరిగ్గా చూసుకోలేకపోయా. ఉన్నట్టుండి జ్వరం వచ్చేది. బిడ్డకు పాలివ్వలేకపోయేదాన్ని.

కానీ, నార్మల్ డెలివరీ తరువాత మొదటి గంటలోనే నేను బిడ్డకు పాలిచ్చా. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆస్పత్రి నుంచి తిరిగొచ్చాక అన్ని పనులూ చేసుకుంటూ, నా పిల్లల్ని చూసుకోగలిగా’ అంటారు సీమా.

మొదటి డెలివరీ సిజేరియన్ అయితే, రెండోది సాధారణ కాన్పు కావడానికి 60-70 శాతం కేసుల్లో అవకాశం ఉంటుందంటారు డాక్టర్ స్వాతి సిన్హా.

‘ఒకవేళ వైద్యులు సాధారణ డెలివరీని సిఫార్సు చేయకపోతే దానికి కచ్చితంగా కారణాలు అడగాలి. ఒక సిజేరియన్ తరువాత మరో సిజేరియన్ కాస్త ప్రమాదకమరమే. గాయాలు మానకపోవడం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది.

సాధారణ ప్రసవం కావాలంటే ఆ దిశగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన జీవనశైలిని అలవర్చుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయాలి. అవన్నీ దినచర్యలో భాగమైపోవాలి. అలా చేస్తే సాధారణ ప్రసవం కావడం పెద్ద కష్టమేం కాదు’ అని డాక్టర్ స్వాతి సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

దక్షిణ కొరియా నాయకులు ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు