ఫేక్ న్యూస్‌పై సమరం: ‘సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు’

సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలు మనుషుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నాయి. అలాంటి వార్తలపై పోరాడుతూ, నిజాలను నిగ్గు తేల్చేందుకు శ్రమిస్తున్నారు కొందరు పాత్రికేయులు. అటువంటి వారిలో ముంబయికి చెందిన జెన్సీ జాకోబ్ ఒకరు.
‘ఫేక్‌న్యూస్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. అయితే 2016 తరువాత ఎక్కువగా మాట్లాడటం మొదలయ్యింది. ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే శక్తి వాటికి ఉందా అనే కోణంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చలు ప్రారంభమయ్యాయి. అందువల్ల మేం ఒక వెబ్సైట్ ప్రారంభించాలని అనుకున్నాం. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఫేక్‌న్యూస్‌పై మా వాళ్లు పని చేస్తారు’ అంటారు జాకోబ్.
ఫేక్ న్యూస్: పాత్రికేయుల సమర శంఖం
నిజమా? కాదా? అని ఎలా తేలుస్తారు?
‘సోషల్ మీడియాకు సంబంధించి హెల్ప్లైన్లు ఏర్పాటు చేశాం. ప్రజలు తమకు వచ్చిన సమాచారాన్ని మాతో పంచుకోవచ్చు. పలానా వార్త నిజమా? కాదా? లేక ఏమైనా వక్రీకరించారా? అని అడగొచ్చు.
మా వద్దకు వచ్చే ఫొటోలు, వీడియోలను కొన్ని ఆన్లైన్ టూల్స్ ద్వారా పరిశీలిస్తాం.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ అలాగే ఇతర వీడియో టూల్స్ ను ఉపయోగించి గతంలో ఎవరైనా వీటిని వాడారా? లేక విశ్వసనీయత కలిగిన వార్తా సంస్థలు ఏమైనా రిపోర్ట్ చేశాయా? అని వెతుకుతాం. ఏదైనా నేర వార్త కనిపిస్తే అది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలుసుకుని, అసలు ఏం జరిగిందో సంబంధిత పోలీసులను, అధికారులను అడుగుతాం.
ఓ రెండు మూడు నెలల తరువాత అసలైన వీడియోలకు నకిలీలు సృష్టిస్తున్నట్లు చాలా సార్లు మేం గమనించాం’ అని ఆ తప్పుడు వార్తలను కనుగొనే పద్ధతి గురించి వివరిస్తారు జాకోబ్.
ప్రాంతీయ భాషల్లోని ఫేక్‌న్యూస్ సంగతేంటి?
ప్రాంతీయ భాషల్లోనూ తప్పుడు వార్తలు, వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. మొత్తంగా తప్పుడు వార్తలకు ఆదిలోనే ఆపకపోతే... మున్ముందు సమస్య మరింత జఠిలమవుతుంది. సోషల్ మీడియాలో చూసిన ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ... ఇది నిజమేనా? అని ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నించుకుంటారో అప్పుడే సత్యాన్వేషణ ప్రారంభమవుతుంది’ అని సూచిస్తారాయన.
ఇవి కూడా చదవండి
- ఫేక్ న్యూస్: అస్సాంలో ఆ ఇద్దరు యువకులు నకిలీ వార్తలకు ఎలా బలయ్యారు?
- ఉత్తర కొరియా: 'వాళ్లు మమ్మల్ని సెక్స్ టాయ్స్‌లా భావించారు'
- బౌడికా: రోమన్లను తరిమికొట్టిన తొలి మహారాణి, ఆమె నేర్పే ఆరు జీవిత పాఠాలు
- మనుస్మృతి ఎందుకు వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది?
- అభిప్రాయం: ‘యాంటీ కాంగ్రెస్’ చంద్రబాబుకు ఇప్పుడు రాహుల్ గాంధీతో స్నేహం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)