పోర్న్ వెబ్‌సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?

  • 4 నవంబర్ 2018
Image copyright Reuters
చిత్రం శీర్షిక భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం శరవేగంగా పెరుగుతోంది.

1.మీరు ఎప్పుడైనా ఏదైనా పోర్న్ వీడియో చూశారా?

2.మీరు మొదటిసారి పోర్న్ చూసినప్పుడు మీ వయసెంతో గుర్తుందా?

3.మీరు వారానికి ఎన్నిసార్లు పోర్న్ వెబ్‌సైట్లు చూస్తారు?

ఈ ప్రశ్నలకు ఎవరూ బహిరంగంగా సమాధానం చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. ఎవరైనా తమ బోల్డ్‌నెస్ చూపించడానికి మొదటి రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినా, మూడో ప్రశ్నకు మాత్రం వారి చిరునవ్వే జవాబు కావచ్చు.

ఈ ప్రశ్నలకు మనం ఎవరి నోటి నుంచీ జవాబులు వినాలని అనుకోకపోయినా, పోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం వార్తలు వచ్చినప్పుడల్లా చాలా మంది ముఖాల్లో కాస్త నిరాశ, కంగారు లాంటివి మీకు కనిపించి ఉండచ్చు.

నిజానికి భారత టెలీకమ్యూనికేషన్స్ విభాగం 827 పోర్న్ వెబ్‌సైట్లు బ్లాక్ చేయాలని దేశంలో ఇంటర్నెట్ సేవలందించే సర్వీసు ప్రొవైడర్లు అందరికీ ఆదేశాలు జారీ చేసింది.

ఉత్తరాఖండ్ హైకోర్ట్ తీర్పు తర్వాత ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. హైకోర్టులో ఒక అత్యాచారం కేసు విచారణ సమయంలో నిందితుడు బాధితురాలిని అత్యాచారం చేసే ముందు పోర్న్ వీడియో చూశానని చెప్పాడు. దాంతో దేశంలో ఉన్న పోర్న్ వెబ్‌సైట్లన్నీ మూసి వేయాలని కోర్టు ఆదేశించింది.

టెలీ కమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాల తర్వాత పోర్న్‌హబ్‌తోపాటు చాలా ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్లు భారత్‌లో ఓపెన్ కావడం లేదు.

ఆ తర్వాత సోషల్ మీడియాలో జనం #PORNBAN అనే హ్యాష్‌టాగ్‌తో తమ స్పందనలు పోస్ట్ చేయడం మొదలు పెట్టారు.

పోర్న్ ఎంతమంది చూస్తున్నారు?

పైన ఇచ్చిన సోషల్ మీడియా వ్యాఖ్యల ద్వారా పోర్న్ వెబ్‌సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించడం వల్ల జనంపై ఎంత ప్రభావం పడిందో మీరు అంచనా వేసుంటారు.

అలాంటప్పుడు, ప్రభుత్వం పోర్న్ సైట్లపై నిజంగానే నిషేధం విధించగలదా అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి సమాధానం వెతికే ముందు, మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. 2015లో కూడా సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ప్రభుత్వం సుమారు 850 పోర్న్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసింది.

కానీ ఆ తర్వాత కొంతకాలానికే ఇంటర్నెట్ ప్రపంచంలో అలాంటి ఎన్నో కొత్త వెబ్‌సైట్లు పుట్టుకొచ్చాయి.

ప్రపంచమంతా పోర్న్ కంటెంట్ అందించే ప్రముఖ వెబ్‌సైట్ 'పోర్న్‌హబ్' సర్వేలో ఒక విషయం వెల్లడైంది. 2017లో భారతదేశంలో పోర్న్ వీడియోలు చూసేవారు 75 శాతం పెరిగారని చెప్పింది.

భారత్‌లో మొబైల్ డేటా వినియోగం ఎక్కువ కావడమే దానికి అతిపెద్ద కారణం అని ఆ సర్వేలో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ పోర్న్ చూసే దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 2014 వరకూ భారత్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉండేది.

Image copyright Getty Images

పోర్న్‌పై ఉన్న చట్టం ఏమిటి?

ఏదైనా రంగంలో ఒక వస్తువుకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పుడు దానిని నియంత్రించడం అంతే కష్టం అవుతుంది. భారత్‌లో పోర్న్ గురించి కూడా కాస్త అలాగే చెబుతారు.

భారత్‌లో పోర్న్‌ను నియంత్రించడానికి ఏదైనా ప్రత్యేక చట్టం ఉందా? సమాధానంగా భారత్‌లో ప్రస్తుతం పోర్న్‌ నియంత్రణ కోసం ఎలాంటి ప్రత్యేక చట్టం లేదని సైబర్ కేసుల నిపుణులు పవన్ దుగ్గల్ చెప్పారు.

"కొన్ని చట్టాలు ఎలా ఉంటాయంటటే అది పోర్నోగ్రఫీపై కూడా అమలు చేయచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ఎలాంటి అశ్లీల ఎలక్ట్రానిక్ కంటెంట్ ప్రచురించినా, ప్రసారం చేసినా, దానికి సాయం చేసినా అది నేరం అవుతుంది. దానికి ఐదేళ్ల జైలు శిక్ష, 3 లక్షల జరిమానా పడుతుంది" అని పవన్ చెప్పారు.

"అశ్లీల కంటెంట్‌లో కేవలం వీడియోలే ఉండవు. ఇందులో ఫొటోలు, స్కెచ్‌లు, టెక్ట్స్ కూడా ఉంటాయి. ఇక చైల్డ్ పోర్నోగ్రఫీ విషయానికి వస్తే, ఆ కంటెంట్‌ను చూడడం కూడా చట్టవిరుద్ధం అవుతుంది. దానికి శిక్షలు కూడా ఉన్నాయి" అని చెప్పారు.

Image copyright Getty Images

పోర్న్ వల్ల మన శరీరంపై ప్రభావం

పవన్ దుగ్గల్ మరో విషయం స్పష్టం చేశారు. "ఏ కంటెంట్, ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఎవరూ చెప్పలేరు. వాటి గురించి చట్టంలో కూడా స్పష్టంగా రాయడం కూడా కష్టమే" అన్నారు.

అలాంటప్పుడు పోర్న్ చూడడం వల్ల మన శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. దీనికి సమాధానంగా "ఒక దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో అవగాహన కల్పించకపోతే అలాంటి చోట ప్రజలకు పోర్న్ అనే ప్రత్యామ్నాయం మాత్రమే మిగులుతుంది" అని సెక్సాలజిస్ట్ వినోద్ రైనా చెప్పారు.

"పోర్న్ చూడడం వల్ల ప్రయోజనాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. దేశంలో సెక్స్ అనేది తప్పుగా భావిస్తారు. అందుకే జనం సెక్స్ అవగాహన అంతా పోర్న్ ద్వారానే నేర్చుకుంటారు. ఇక నష్టం ఏంటంటే సెక్స్ గురించి సరిగా తెలియకపోవడం వల్ల కొందరు పోర్న్ వీడియోలపై ఆధారపడి తప్పుడు కోణంలో ఆలోచిస్తారు" అంటారు వినోద్

"అడల్ట్ వయసులో ఉన్న ఒక వ్యక్తి పోర్న్ కంటెంట్ చూస్తే, అతడిని అడ్డుకోకూడదు. మన దేశంలో కామసూత్ర రాశారు. ఇక్కడి ఖజురహో మందిరాల్లో సెక్స్‌కు సంబంధించిన దృశ్యాలు, విగ్రహాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం వెబ్‌సైట్లను ఏమేరకు నియంత్రించగలం. ఎవరైనా పోర్న్ చూసి అత్యాచారం చేస్తుంటే, ప్రభుత్వం మొదట మత్తు ఇచ్చే అన్ని వస్తువులపైనా నిషేధం విధించాల్సి ఉంటుంది. ఎందుకంటే అత్యాచారాల వెనుక ఉన్న అతిపెద్ద కారణం అవే" అని వినోద్ వివరించారు.

Image copyright Getty Images

పోర్న్ నియంత్రణ సాధ్యమేనా?

పోర్న్ వెబ్‌సైట్లపై నిషేధం విధించే విషయం బయటికి రావడంతో పోర్న్ హబ్ భారత ప్రేక్షకుల కోసం తన రెండో వెబ్‌సైట్ సిద్దం చేసేసింది. ఆ సమాచారం అది తమ ట్విటర్‌లో కూడా పోస్ట్ చేసింది.

పోర్న్ హబ్ లాంటి ఎన్నో వెబ్ సైట్లపై నిషేధం విధించిన తర్వాత కూడా దేశంలో పోర్న్ కంటెంట్ అందుతూనే ఉంటుందా? అయినా అది ఎలా సాధ్యం?

పై ప్రశ్నకు సమాధానంగా "నిజానికి భారత్‌లో అందుబాటులో ఉండే పోర్న్ కంటెంట్‌లో ఎక్కువ శాతం విదేశీ వెబ్‌సైట్లవే ఉంటాయి. అప్పుడు అవి నేరుగా భారత చట్టం కిందికి రావు. ఒకవేళ ఏదైనా వెబ్‌సైట్‌ను ప్రభుత్వం నిషేధించినా, దాని హద్దులను మాత్రం ఎవరూ నియంత్రించలేరు. నిషేధం తర్వాత పోర్న్ వెబ్‌సైట్లు మారు పేర్లతో మళ్లీ అందుబాటులోకి వస్తున్నాయంటే కారణం అదే" అని దుగ్గల్ తెలిపారు.

సైబర్ నిపుణులు పవన్ దుగ్గల్, సెక్సాలజిస్ట్ వినోద్ రైనా ఇద్దరూ "భారత్ లాంటి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఇంటర్నెట్లో ఎలాంటి కంటెంట్‌పై అయినా నిషేధం విధించడం అసంభవం" అంటున్నారు.

Image copyright Science Photo Library

అయితే దీనికి పరిష్కారం?

దీనికి ఇద్దరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సెక్స్‌ గురించి అవగాహన కల్పించడం. "స్కూలు పాఠ్యాంశాల్లో ఆరో తరగతి తర్వాత సెక్స్‌కు సంబంధించి అవగాహన కల్పించాలని, అప్పుడే విద్యార్థులు పెరిగాక, తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా, సరైన సమాచారం పొందుతారని" వినోద్ రైనా అన్నారు.

ఇటు పవన్ దుగ్గల్ "వీలైనంత తక్కువగా పోర్నోగ్రఫిక్ వెబ్‌సైట్లలోకి వెళ్లేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఆ వెబ్‌సైట్లలో కొన్ని ఫ్రాడ్‌కు సంబంధించిన లింకులు ఉంటాయి. జనం తరచూ పోర్న్ చూడడం వల్ల, ఈ మోసాల్లో కూడా చిక్కుకోవచ్చు.

అంతా చూస్తుంటే, మొత్తానికి ఇక్కడ ఒకటే అనిపిస్తోంది. ఇలాంటి నిషేధాలు కాలానికి అనుగణంగా వస్తూనే ఉండచ్చు. కానీ వీటిపై ప్రభుత్వాలు పూర్తిగా పట్టు బిగించడం మాత్రం వీలు కాదు.’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

క్రికెట్ ప్రపంచ కప్ 2019: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో గెలిచేదెవరు...

క్రికెట్ వరల్డ్ కప్ 2019 : వన్డేల్లో అత్యుత్తమ భారత జట్టు ఇదేనా...

విక్టోరియా మోడెస్టా: కృత్రిమ కాలుతో.. పారిస్ కేబరేను షేక్ చేస్తున్న బయోనిక్ షోగర్ల్

ప్రెస్ రివ్యూ: 'టీఆర్‌ఎ‌స్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే' -కోమటిరెడ్డి రాజగోపాల్

క్రికెట్ ప్రపంచ కప్ 2019: పాకిస్తాన్‌తో ఆడిన 6 మ్యాచుల్లో భారత్ ఎలా గెలిచింది...

క్రికెట్ ప్రపంచ కప్ 2019: 'పాకిస్తాన్ బౌలింగ్, భారత్ బ్యాటింగ్ మధ్యే పోటీ' -ఇంజమామ్ ఉల్ హక్

క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి

రెండో ప్రపంచ యుద్ధంలో విడిపోయి 75 ఏళ్ల తర్వాత కలుసుకున్న ప్రేమజంట