దీపావళి హరిత టపాసులు: ‘ధర తక్కువ.. మోత ఎక్కువ.. పైగా కాలుష్యం లేకుండా’

పంజాబ్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) శాస్త్రవేత్తలు, దీపావళి నేపథ్యంలో పొగరాని టపాసులను కనిపెట్టారు. అవి హరిత టపాసుల శ్రేణిలోకి వస్తాయని చెప్తున్నారు. బీబీసీ ప్రతినిధులు అరవింద్ ఛాబ్రా, సరబ్జిత్ ధాలీవాల్ అందిస్తున్న కథనం..
ఇవే హరిత టపాసులు. శబ్దం వస్తుంది కానీ పొగ రాదు. ఇవి కాలుష్య రహిత టపాసులు’ అని వాటిని పరిచయం చేస్తున్నారు ఐఐఎస్ఈఆర్ శాస్త్రవేత్త డాక్టర్ సామ్రాట్ ఘోష్.
ఈ గ్రీన్ టపాకాయల్ని తయారు చేసే విధానాన్ని కనుగొన్నది ఆయనే.
తక్కువ కాలుష్యం సృష్టించే టపాసులను వాడాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది.
‘‘ఇవి సూపర్ గ్రీన్ కేటగిరీకి చెందిన టపాసులు. సూపర్ గ్రీన్ ఎందుకంటే... ఇవి పర్యావరణ హితమైనవే కాకుండా.. వీటి తయారీకి మేం అనుసరించే ప్రక్రియ కూడా పర్యావరణానికి ఎలాంటి నష్టం చేయదు. చాలా సార్లు ఏం జరుగుతుందంటే.. తయారు చేసే వస్తువు పర్యావరణహితమైందిగా ఉంటుంది కానీ దాని తయారీలో వెలువడే వ్యర్థాలు పర్యావరణానికి నష్టం చేస్తాయి. పటాసుల్ని కాల్చిన తర్వాత వెలువడే ఉద్గారాలు, అందులోంచి విడుదలయ్యే పార్టిక్యులేట్ మ్యాటర్... సూక్ష్మ కాలుష్య కారకాలు చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే వాటిని గ్రీన్ కాకర్స్ అంటారు’’ అని సామ్రాట్ ఘోష్ అన్నారు.
గ్రీన్ టపాకాయల తయారీపై కొన్ని ఇతర సంస్థల్లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.
- ఈసారికి ఈ-టపాసులతో సరి!
- మతాబులకి మతానికి సంబంధం ఉందా?
- దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకే టపాసులు కాల్చాలి: సుప్రీంకోర్టు
హరిత టపాసుల ధర కూడా మామూలు సంప్రదాయ టపాసుల కన్నా తక్కువే ఉంటుందని సామ్రాట్ ఘోష్ అంటున్నారు.
‘‘పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పెసో) నుంచి సర్టిఫికేట్ పొందడం ఇందులో ఎదురయ్యే మొదటి సవాలు. ఎవరు టపాసుల్ని తయారు చేసినా, వాటిని మార్కెట్లోకి విడుదల చేయాలనుకున్నా పేసో నుంచి సర్టిఫికేట్ తప్పనిసరి. ఆ తర్వాత వీటికి ధరలను నిర్ణయించడం ఒక ముఖ్యమైన అంశం. పొగరాని, సూపర్ గ్రీన్ టపాసులు నిజానికి చాలా చౌక. మాకు వీటిని తయారు చేయడానికి ఒక్కో టపాసుపై 5 రూపాయలు ఖర్చవుతోంది. కానీ మేం దీన్ని బయటి తయారీదారులకు అందిస్తే ఈ ధర వారికి గిట్టుబాటు కాదు’’ అని సామ్రాట్ ఘోష్ వివరించారు.
ఈ గ్రీన్ క్రాకర్స్ ఇంకా మార్కెట్లో అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- అమెరికా మధ్యంతర ఎన్నికలు: జనాభాకు తగిన ప్రాతినిధ్యం ఉందా?
- అభిప్రాయం: కాంగ్రెస్ - టీడీపీ కలయికను ఎలా అర్థం చేసుకోవచ్చు?
- ఐవీఎఫ్ ప్రభావంతో... తగ్గిపోతున్న ‘పిల్లల దత్తత’
- దీపావళి ప్రత్యేకం: లక్ష్మీదేవి బొమ్మలో ముఖం ఎవరిది?
- అవతార్ సీక్వెల్: నాలుగు కొత్త సినిమాల పేర్లు ఇవేనా?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)