స్మార్ట్ ఫోన్‌ను అతిగా వాడుతున్న పిల్లలను ఎలా నియంత్రించాలి?

  • 24 నవంబర్ 2018
మొబైల్ ఫోన్

పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం ఎలా? చాలామంది తల్లిదండ్రులను వేధించే ప్రశ్న ఇది.

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు మొబైల్ ఫోన్లు అడ్డంకిగా మారుతున్నాయి.

చాకొలెట్ల వ్యసనం కంటే స్మార్ట్‌ఫోన్ల వ్యసనమే ఎక్కువగా కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మరి తల్లిదండ్రులు ఏం చేయాలి?

కొన్ని ఈ-పేరెంటింగ్ టిప్స్ ద్వారా పిల్లల ఆలోచనలను మార్చొచ్చు.

ఇంటికి కొన్ని నియమాలను రూపొందించాలి. ఉదాహరణకు, ఎంతసేపు మొబైల్ వాడాలో పక్కాగా చెప్పాలి.

పిల్లలతో మాట్లాడి ఇంటర్నెట్‌లో వాళ్లేం చూస్తున్నారో తెలుసుకోవాలి.

ఏవో వీడియోలు, వెబ్‌సైట్లు చూసే బదులు సోషల్ మీడియాలో స్నేహితులతో మాట్లాడమని సూచించాలి.

ఏది కనిపిస్తే దానిపైన క్లిక్ చేయడం ప్రమాదకరమని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

పిల్లలకు సరిపడని వెబ్‌సైట్లు ఫోన్‌లో కనిపించకుండా సెట్టింగ్స్ మార్చాలి.

ఇంటర్నెట్‌లో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం ప్రమాదకరమని తెలియజేయాలి.

అన్నిటికంటే ముఖ్యంగా, పిల్లలకు నేర్పే ముందు తల్లిదండ్రులు తమ అలవాట్లను మార్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)