కన్నడ ‘రెబల్ స్టార్’, నటి సుమలత భర్త అంబరీశ్ కన్నుమూత

  • 25 నవంబర్ 2018
అంబరీశ్ Image copyright FB / Rebel stat Ambarish

కన్నడ ప్రముఖ నటుడు అంబరీశ్‌ కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆయన్ను శనివారం రాత్రి బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు.

రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో అంబరీశ్‌ను జేపీనగరలోని ఆయన నివాసం నుంచి విక్రం వైద్యశాలకు తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. 10 గంటల సమయంలో ఆయన మృతి చెందారని వైద్యులు ప్రకటించారు.

అంబరీశ్, నటి సుమలతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అభిషేక్‌ అనే కుమారుడు ఉన్నాడు.

Image copyright FACEBOOK/Rebel Star Ambarish
చిత్రం శీర్షిక అంబరీశ్

ఈయన అసలు పేరు మలపళ్లి హుచ్చేగౌడ అమరనాథ్.

66 ఏళ్ల అంబరీశ్ కన్నడంతోపాటు తమిళ, మలయాళ, హిందీ, తెలుగు చిత్రాలలో నటించారు. అభిమానులు ఆయన్ను రెబల్ స్టార్ అని పిలుచుకుంటారు.

అంబరీశ్ 1952 మే 29న కర్ణాటకలోని మండ్యా జిల్లా మద్దూరు తాలూకా దొడ్డరకినకెరె గ్రామంలో జన్మించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన అంబరీశ్ మొదటిసారిగా 1998లో 12వ లోక్‌సభ ఎంపీ అయ్యారు. తర్వాత 13, 14వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.

మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార, ప్రసారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

2013లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన అంబరీష్ సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

అంబరీశ్ మృతికి నటుడు రజనీకాంత్ సంతాపం తెలిపారు. మంచి స్నేహితుడిని కోల్పోయానని ట్వీట్ చేశారు.ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు LIVE: జగన్ సునామీ... 152 స్థానాల్లో ఆధిక్యం... 23 స్థానాల్లోనే టీడీపీ ప్రభావం.. రాజోలులో జనసేన గెలుపు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 300 స్థానాల్లో బీజేపీ.. 49 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

LIVE: నిజామాబాద్‌లో కవిత వెనుకంజ, మాల్కాజిగిరిలో రేవంత్ ముందంజ : ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

57 ఏళ్ల తరువాత తెలుగు నేలపై యంగ్ సీఎం

అమేఠీలో రాహుల్ గాంధీ వెనుకంజ.. ఆధిక్యంలో స్మృతీ ఇరానీ

‘జగన్‌కు ఉన్న ప్రజాదరణ అప్పట్లో ఎన్టీఆర్‌కు మాత్రమే ఉండేది’

నారా చంద్రబాబు నాయుడు: రాజకీయ చాతుర్యం, పరిపాలనా దక్షత వయసు రీత్యా బలహీనపడ్డాయా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు