మహారాష్ర్టలో మరాఠాలకు రిజర్వేషన్లు: బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

  • 29 నవంబర్ 2018
మహా రిజర్వేషన్లు Image copyright Getty Images
చిత్రం శీర్షిక మహారాష్ట్ర అసెంబ్లీ భవనం

మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లు పాస్ చేసింది.

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదనను మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

మహారాష్ట్ర స్టేట్ బ్యాక్‌వర్డ్ క్లాస్ కమిషన్ ప్రతిపాదనలపై తీసుకున్న చర్యల నివేదిక( ఏటీఆర్)తోపాటు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రిజర్వేషలన్ల కోసం మరాఠాల ప్రదర్శన

మరాఠాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరుల తరగతిగా(ఎస్ఈబీసీ)గా ప్యానల్ ప్రకటించింది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి తగినంత ప్రాతినిధ్యం లభించలేదని తమ నివేదికలో పేర్కొంది.

రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం రిజర్వేషన్ ప్రయోజనాలకు వారు అర్హులేనని తెలిపింది.

అసాధారణ పరిస్థితులను పరిశీలించిన తర్వాత మరాఠాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డారని, రిజర్వేషన్ ప్రయోజనాలకు వారు అర్హులేనని తాము ప్రకటించినట్లు ప్యానల్ ఇందులో సూచించింది.

రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దడానికి రాజ్యాంగ నిబంధనలకు లోబడి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది.

విద్యాసంస్థల్లో ప్రవేశానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని తర్వాత బిల్లును ప్రవేశపెట్టారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రిజర్వేషన్లపై చర్చించడానికి వెళ్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

బిల్లులో ప్రధాన అంశాలు

  • ఈ బిల్లు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన పౌరులుగా ప్రకటించిన మరాఠాలకు విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు రిజర్వేషన్లు కల్పిస్తుంది.
  • ఈ బిల్లు ప్రకారం మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు.
  • రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు వర్తించవు.
  • రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓబీసీ బిల్లుతోపాటు ఈ రిజర్వేషన్ బిల్లు కూడా ఉంటుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరాయి.
Image copyright Getty Images
చిత్రం శీర్షిక రిజర్వేషన్ల కోసం మరాఠాల ఆందోళన

ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాసంస్థల ప్రవేశాల్లో రిజర్వేషన్లు కావాలంటూ మరాఠా సమాజం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది.

ఈ ఏడాది జులై, ఆగస్టులో రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

బిల్లును సభలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, దానిని సభ ఏకగ్రీవంగా ఆమోదించేలా సహకరించిన విపక్షానికి ధన్యవాదాలు తెలిపారు.

2014లో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం మరాఠా సమాజానికి 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్లను న్యాయస్థానం రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరి కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రధాన నిందితుడైన బోటు యజమాని, మరో ఇద్దరి అరెస్ట్

శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డులోకి ఎలా వచ్చారు... చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనకు అవకాశం ఎలా ఇచ్చారు?

గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు.. మేట్ 30 ప్రోలో మూవీ కెమెరా

ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

నిర్మలా సీతారామన్: కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు... లాభాలతో ఉరకలెత్తిన సెన్సెక్స్

గోదావరి పడవ ప్ర‌మాదాలు: ఇన్నేళ్ళుగా ప్ర‌భుత్వం తీసుకున్న చర్యలేంటి? వాటి ఫలితాలేమిటి?

గోదావరిలో ప్రమాదం: ఈరోజు కూడా బోటు బయటకు వచ్చే అవకాశాలు లేనట్లే

వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'