లోక్‌సభ ఎన్నికలు 2019: వీవీపాట్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల సంఘం ఓటింగ్ విషయంలో అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది.
బ్యాలెట్ బాక్స్‌ల నుంచి ఈవీఎంల వరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూనే ఉంది.
అయితే, ఓటింగ్‌లో మరింత పాదర్శకతకు పేపర్ బ్యాలెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 16 రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వీవీపాట్‌ను తీసుకొచ్చింది.
ఫొటో సోర్స్, Getty Images
వీవీపాట్.. ఇకమై మీ ఓటును ప్రింట్ తీసుకోవచ్చు
- ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయిల్‌కు సంక్షిప్త రూపమే వీవీపాట్. ఇది ఒక చిన్న ప్రింటిర్ లాంటిది. వీవీపాట్‌ను ఈవీఎంలకు అనుసంధానిస్తారు.
- తాము వేసిన ఓటు ఎవరికి పడిందో ఓటర్లు చూసుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం దీన్ని తీసుకొచ్చింది.
- మనం ఏ పార్టీకి ఓటు వేశామనదే వీవీపాట్ల ద్వారా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది.
- ఈవీఎంలో మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత వీవీపాట్ ఒక స్లిప్‌లో ఆ అభ్యర్థి పేరు, గుర్తు వచ్చేలా ప్రింట్ తీసి సీల్డ్ బాక్స్‌లో పడేస్తుంది.
- ఓటు వేసిన ఏడు సెకన్ల తర్వాత వీవీపాట్ బీప్ శబ్దం చేస్తూ ప్రింట్‌ను చూపిస్తుంది.
- 2013లో నాగాలాండ్‌లోని నొక్సెన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారి వీవీపాట్లను ఎన్నికల సంఘం ఉపయోగించింది.
- సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2014 సాధారణ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ బూత్‌లలో వీవీపాట్లను ఎన్నికల సంఘం ఉపయోగించింది.
ఇవి కూడా చదవండి
- సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నికల బరిలో..
- 2014 ఎన్నికల్లో ఆ గట్టు.. 2018లో ఈ గట్టు
- తెలంగాణ ఎన్నికలు 2018: మీ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరో తెలుసుకోండి
- 'సర్కార్'లో చెప్తున్న సెక్షన్ 49(పి)తో దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?
- నల్లగొండ జిల్లాలో ఆడపిల్లల అమ్మకాలు ఆగిపోయాయా? సంక్షేమ పథకాలతో సమస్య పరిష్కారమైందా?
- తెలంగాణ ఎన్నికలు: “ప్రత్యేక రాష్ట్రం వస్తే పాతబస్తీ వెలిగిపోతుందన్నారు. కానీ హామీలే మిగిలాయి”
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)