తెలంగాణ ఎన్నికలు: మీ ఓటు మరొకరు వేస్తే ఏం చేయాలి?

  • 7 డిసెంబర్ 2018
Image copyright Getty Images

ప్రశ్న: నాకు ఓటరు గుర్తింపు కార్డు లేదు. నేను ఓటు వేయవచ్చా?

సమాధానం: ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే మీకు సంబంధించిన, ప్రభుత్వం గుర్తించిన వేరే గుర్తింపు కార్డులను పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయోచ్చు.

ప్రశ్న: పోలింగ్ బూత్ ఎక్కడుందో ఎలా తెలుసుకోవచ్చు?

సమాధానం: ఎన్నికల తేదీ కంటే ముందే అధికారులు మీకు ఓటరు స్లిప్‌లను అందిస్తారు. అందులో మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రం వివరాలు ఉంటాయి.

ప్రశ్న: ఓటర్ల జాబితాలో నా పేరు ఉందా లేదా ఏలా తెలుసుకోవాలి?

సమాధానం: ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు అలాగే, స్థానిక ఎన్నికల కార్యాలయంలో కూడా తెలుసుకోవచ్చు.

ప్రశ్న: ఈవీఎంలో ఎలా ఓటు వేయాలి?

సమాధానం: ఈవీఎం మీద అభ్యర్థుల పేరు, ఫొటో తో పాటు పార్టీ గుర్తు ఉంటుంది . మీకు నచ్చిన అభ్యర్థికి సంబంధించిన గుర్తు పక్కన ఉండే మీట నొక్కడం ద్వారా ఓటు వేయవచ్చు.

ప్రశ్న: నేను ఎవరికి ఓటు వేశానని తెలుసుకునే అవకాశం ఉందా?

సమాధానం: ఈవీఎంకు అనుసంధానమై ఉన్న వీవీప్యాట్ ద్వారా మీరు ఎవరికి ఓటు వేశారో చూసుకోవచ్చు.

ప్రశ్న: నా ఓటరు ఐడీ కార్డు పోయింది. కొత్తది ఎక్కడ తీసుకోవాలి?

సమాధానం: మొదట పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేయాలి. రూ. 25 డిపాజిట్ చేయాలి. అప్పుడు కొత్త కార్డును తీసుకోవచ్చు.

ప్రశ్న: వేరే వాళ్లు నా ఓటు వేశారు. ఆ ఓటును రద్దు చేసి నా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందా?

సమాధానం: ఉంది. మీకు బదులుగా వేరే వ్యక్తి ఓటు వేస్తే ఎన్నికల సంఘం నిబంధన 49 (పీ) అనుసరించి మీకు సంబంధించిన గుర్తింపు కార్డులను ప్రిసైడింగ్ అధికారికి చూపి మీ ఓటు హక్కును పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)