తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ శాతం 73.20: ఏ నియోజవర్గంలో ఎంత నమోదైందంటే..

  • 8 డిసెంబర్ 2018
హైదరాబాద్ శివారులో డిసెంబర్ ఏడున ఓటేసిన మహిళలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక హైదరాబాద్ శివారులో డిసెంబర్ ఏడున ఓటేసిన గిరిజన మహిళలు

తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 7న పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్ నమోదయ్యింది.

ఈ మేరకు శనివారం రాత్రి తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్ కుమార్ విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.

గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి 3.7 శాతం పెరిగిందన్నారు. గత ఎన్నికల్లో 69.50 శాతం నమోదైంది.

అత్యధికంగా మధిరలో 91.65 శాతం నమోదైందని రజత్ కుమార్ చెప్పారు.

అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 40.18 శాతం పోలింగ్ నమోదైందన్నారు.

రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో 48.89 శాతం నమోదైందన్నారు.

తాజా ఎన్నికల్లో పురుషుల పోలింగ్‌ శాతం 72.54 కాగా 73.88 శాతం మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.

నియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)