తెలంగాణ ఎన్నికలు: తొలిసారి ఓటు వేసిన గద్దర్

  • 7 డిసెంబర్ 2018
గద్దర్ Image copyright ugc

ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చిన గద్దర్ తెలంగాణ ఎన్నికలో తొలిసారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని రోజుల కిందటే ఆయన ఎన్నికల జాబితాలో తన పేరు నమోదు చేయించుకున్నారు.

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని దిల్లీలో కలిసిన ఆయన తాను చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

విపక్షాలు మద్దతిస్తే స్వతంత్ర అభ్యర్థిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వెల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు.

ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు గద్దర్ తన భార్యతో కలిసి భారత రాజ్యాంగ పుస్తకం, అంబేద్కర్, ఫూలే ఫొటోలను పట్టుకొని హైదరాబాద్‌లోని అల్వాల్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)