ఎగ్జిట్ పోల్స్: మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ, రాజస్థాన్‌ కాంగ్రెస్‌కు

జ్యోతిరాదిత్య సింధియా

అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చివరి దశలో తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలో పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.

మధ్యప్రదేశ్‌

మొత్తం 230 స్థానాలలో బీజేపీకి 102-120, కాంగ్రెస్‌కు 104-122 స్థానాలు వస్తాయని ఇండియాటుడే-యాక్సిక్ మైఇండియా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

ఇక టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్‌.. బీజేపీకి 126 స్థానాలు, కాంగ్రెస్‌కు 89 స్థానాలు వస్తాయని వెల్లడించింది.

రాజస్థాన్

రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లలో బీజేపీ 85 స్థానాలలో, కాంగ్రెస్ 105 స్థానాలలో, ఇతరులు 9 స్థానాలలో విజయం సాధిస్తాయని టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్‌ తెలిపింది.

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ 55-72 సీట్లు, కాంగ్రెస్ 119-141 సీట్లు, ఇతరులు 4-11 సీట్లలో విజయం సాధిస్తాయని వెల్లడించాయి.

ఛత్తీస్‌గఢ్‌

టైమ్స్‌నౌ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్‌లో.. మొత్తం 90 స్థానాలలో బీజేపీ 46 స్థానాలను, కాంగ్రెస్ 35 స్థానాలను, ఇతరులు 9 స్థానాలను గెలుచుకుంటాయని వెల్లడైంది.

రిపబ్లిక్-సీ ఓటర్.. బీజేపీ 35-43 స్థానాలను, కాంగ్రెస్ 40-50 స్థానాలను, ఇతరులు 3-7 స్థానాలను గెలుచుకుంటాయని వెల్లడించింది.

మిజోరం

రిపబ్లిక్-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్.. మొత్తం 40 స్థానాలలో ఎంఎన్‌ఎఫ్ 16-20 స్థానాలు, కాంగ్రెస్ 14-18 స్థానాలు, జెడ్పీఎం 3-7 స్థానాలు గెల్చుకోనున్నాయని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)