లోక్‌సభ ఎన్నికలు 2019: ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు? వీవీ ప్యాట్‌లు అంటే ఏంటి?

  • 10 డిసెంబర్ 2018
ఈవీఎం Image copyright Eci

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తోంది. ఈవీఎం మెషీన్లలో నిక్షిప్తమై ఉన్న ఓట్లు ఎవరికి అధికారం కట్టబెడతాయో అన్న ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తున్నారు.

116 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయపార్టీలు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది. ప్రతి రౌండ్‌‌లోనూ వారు సంతృప్తి చెందిన తర్వాతే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు.

ఈ నేపథ్యంలో అసలు ఈవీఎం మెషీన్లలో ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో చూద్దాం. ఆ సమయంలో లెక్కింపు సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూద్దాం.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారో చూద్దాం.
  1. ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్‌ను తొలగిస్తారు.
  2. ఈవీఎం బయటి కప్పు మాత్రమే తెరుస్తారు. లోపలి భాగాన్ని తెరవకుండా అలాగే ఉంచుతారు.
  3. తర్వాత ఈవీఎం పవర్ ఆన్ చేస్తారు.
  4. బ్యాటరీలో ఛార్జింగ్ తక్కువగా ఉంటే ఆ మెషీన్‌కి ఉండే డిజిటల్ తెర మిణుకుమిణుకుమని వెలుగుతుంది. లేదంటే ఖాళీగా కనిపిస్తుంది. అప్పుడు కొత్త బ్యాటరీ అమర్చాలి.
  5. అనంతరం లోపల బటన్ మాదిరిగా కనిపించే సీల్‌ను తొలగిస్తే లోపల రిజల్ట్స్ మీట కనిపిస్తుంది. ఆ మీట నొక్కగానే ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెరపై కనిపిస్తుంది.
  6. ఆ వివరాలను జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)