తెలంగాణ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ కూటమి 21 స్థానాల్లో గెలుపు

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. గురువారం మధ్యాహ్నం 1.30కు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ స్పందిస్తూ.. గురువారం ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఎమ్మెల్యేల ఎన్నికకు సంబంధించి గవర్నర్ గెజిట్ ప్రకటన చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో తనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా? లేదా? అన్నది మాత్రం గెజిట్ ప్రకటన వెలువడే సమయంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.
గత ఎన్నికలతో పోల్చితే ఈసారి టీఆర్ఎస్కు పోలైన ఓట్ల శాతం భారీగా పెరిగింది. 2014లో 34.15 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 12.75 శాతం పెరిగి 46.9 శాతానికి చేరింది. టీడీపీకి 2014లో 14.7 శాతం ఓట్లు పడగా, ఇప్పుడు 11.2 శాతం తగ్గి 3.5 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో 4.2శాతం ఓట్లు పెరిగినా.. సీట్లు మాత్రం పెరగలేదు. పైగా 2014తో పోల్చితే 2 సీట్లు తగ్గాయి.
- కారు జోరుకు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి వంటి హేమాహేమీలంతా ఓడిపోయారు.
- టీఆర్ఎస్ నేతల్లో సిద్ధిపేటలో హరీశ్ రావుకు 1,18,699 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీ లభించింది.
- సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ 89 వేల ఓట్ల తేడాతో గెలిచారు.
- కేసీఆర్ కేబినెట్లోని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్ రెడ్డి, ఆజ్మీరా చందూలాల్ ఓటమి పాలయ్యారు.
- బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్ ఓడిపోగా.. బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరే గెలుపొందారు.
సమయం 13.25
హైదారాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైనా శాసనసభ్యులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు.
పార్టీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకుని, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడు ఉంటుందన్నది నిర్ణయించనున్నారు.
సమయం 1.00
ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రజత్ కుమార్ చెప్పారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదన్నారు.
ఓటర్ల జాబితాలో అన్యాయంగా లక్షల మంది పేర్లు తొలగించి ఉంటే రాష్ర్టంలో శాంతి భద్రతల సమస్య వచ్చి ఉండేదని అలాంటిది ఏమీ లేదని ఆయన చెప్పారు.
ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు మరోసారి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడతామని రజత్ కుమార్ తెలిపారు.
ప్రజలు ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలని సూచించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదన్నారు.
సమయం 12.30
గురువారం మధ్యాహ్నం 1.30కు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ, ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ ధ్రువీకరించలేదు. ఈ మేరకు ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద ఉన్న బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని తెలిపారు.
సీఎం పదవీ ప్రమాణం గురువారం , లేకుంటే ఈనెల 16న ఉండొచ్చని అక్కడకు వచ్చిన నేతలు చెబుతున్నారు.
ఈ అంశంపై మరిన్ని అప్ డేట్స్ కోసం.. సీఎం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడన్న విషయంపై స్పష్టత కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
సమయం 11.55
మరికాసేపట్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరవుతున్నారు.
ఫొటో సోర్స్, Eci
ఆధారం: ఎన్నికల సంఘం
తేది 12.12.2018, ఉదయం 6.30
గత ఎన్నికలతో పోల్చితే ఈసారి టీఆర్ఎస్కు పోలైన ఓట్ల శాతం భారీగా పెరిగింది. 2014లో 34.15 శాతం ఓట్లు రాగా, ఇప్పుడు 12.75 శాతం పెరిగి 46.9 శాతానికి చేరింది. టీడీపీకి 2014లో 14.7 శాతం ఓట్లు పడగా, ఇప్పుడు 11.2 శాతం తగ్గి 3.5 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో 4.2శాతం ఓట్లు పెరిగినా.. సీట్లు మాత్రం పెరగలేదు. పైగా 2014తో పోల్చితే 2 సీట్లు తగ్గాయి.
ఓట్ల శాతం
టీఆర్ఎస్- 46.9 శాతం
కాంగ్రెస్ - 28.4 శాతం
బీజేపీ - 7 శాతం
టీడీపీ - 3.5 శాతం
స్వతంత్రులు- 3.3 శాతం
ఎంఐఎం - 2.7 శాతం
బీఎస్పీ - 2.1 శాతం
టీజేఎస్ - 0.5 శాతం
నోటా - 1.1 శాతం
ఇతరులు - 4.5 శాతం
రాత్రి 08.20
టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ కూటమి 21, బీజేపీ 01, ఇతరులు 9(ఎంఐఎంతో కలిపి) చోట్ల విజయం
రాత్రి 08.00
టీఆర్ఎస్ 86, కాంగ్రెస్ కూటమి 19, బీజేపీ 01, ఇతరులు 6 చోట్ల విజయం
విజేతలు వీరే..
సాయంత్రం 07.30
టీఆర్ఎస్ 84, కాంగ్రెస్ కూటమి 19, బీజేపీ 01, ఇతరులు 5 చోట్ల విజయం
సాయంత్రం 07.15
టీఆర్ఎస్ 82, కాంగ్రెస్ కూటమి 17, బీజేపీ 01, ఇతరులు 4 చోట్ల విజయం
సాయంత్రం 07.10
టీఆర్ఎస్ 78, కాంగ్రెస్ కూటమి 17, బీజేపీ 01, ఇతరులు 4 చోట్ల విజయం
- కేసీఆర్ సరికొత్త రికార్డు: తెలంగాణ నుంచి అత్యధికంగా 8 సార్లు ఎమ్మెల్యే
- సంక్షేమ పథకాల హైవేపై కారు జోరు - ఎడిటర్స్ కామెంట్
- ‘హైటెక్‌సిటీ’లో తెలుగుదేశం పార్టీ ఓటమి
- టీఆర్ఎస్ ప్రస్థానం: పోరు నుంచి పాలన వరకు కారు జోరు
- పవన్ కల్యాణ్: ‘ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది’
- కేసీఆర్ ప్రెస్‌మీట్: ''చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు.. నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా''
- రెండే రెండు ఫొటోల్లో.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు..
- ‘కేసీఆర్ గెలుపు.. రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసెన్స్ కాదు’
- ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు’ - చంద్రబాబు నాయుడు
సాయంత్రం 06.55
టీఆర్ఎస్ 76, కాంగ్రెస్ కూటమి 16, బీజేపీ 01, ఇతరులు 4 చోట్ల విజయం
సాయంత్రం 06.45
టీఆర్ఎస్ 66, కాంగ్రెస్ కూటమి 16, బీజేపీ 01, ఇతరులు 4 చోట్ల విజయం
సాయంత్రం 06.40
కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి ట్వీట్
సాయంత్రం 06.35
టీఆర్ఎస్ 62, కాంగ్రెస్ కూటమి 16, బీజేపీ 01, ఇతరులు 4 చోట్ల విజయం
సాయంత్రం 06.30
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
''తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కె. చంద్రశేఖర్ రావుకు నా తరపున, జనసేన శ్రేణుల తరపున హృదయపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైంది'' అని పవన్ అన్నారు.
సాయంత్రం 06.25
టీఆర్ఎస్ 58, కాంగ్రెస్ కూటమి 15, ఇతరులు 4 చోట్ల విజయం
సాయంత్రం 06.00
టీఆర్ఎస్ 53, కాంగ్రెస్ కూటమి 12, ఇతరులు 2 చోట్ల విజయం
వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజయంతో దివ్యాంగుడి సంబరం
సాయంత్రం 05.30
టీఆర్ఎస్ 49, కాంగ్రెస్ కూటమి 12, ఇతరులు 2 చోట్ల విజయం
సాయంత్రం 05.30
టీఆర్ఎస్ 45, కాంగ్రెస్ కూటమి 10, ఇతరులు 2 చోట్ల విజయం
సాయంత్రం 05.05
టీఆర్ఎస్ 40, కాంగ్రెస్ కూటమి 8, ఇతరులు 2 చోట్ల విజయం
సాయంత్రం 04.50
తెలంగాణ భవన్ నుంచి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
''సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయం. ప్రతి ఒక్కరికీ శిరసు వహించి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తున్నా.
ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వహించే దిశగా మనం పనిచేయాలి. వృధా చేసే అధికారం మనకు లేదు.
కొత్త రాష్ట్రాన్ని ఒక బాటలో పెట్టాం. ఆ బాట గమ్యం చేరాలి.
కోటి ఎకరాలు పంట పండాలి తెలంగాణలో.'' అని అన్నారు.
''కంటి వెలుగు రూపంలో, కేసీఆర్ కిట్ రూపంలో ప్రారంభించినం. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేస్తున్నాం. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేస్తాం. కంటివెలుగు డాక్టర్ల తర్వాత ఈఎన్టీ డాక్టర్ల బృందం, డెంటల్ డాక్టర్ల బృందం, పాథలాజికల్ డాక్టర్లు వెళతారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు.. తెలంగాణ ఆరోగ్య స్థితి రికార్డవుతుంది.'' అన్నారు.
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం...
''దేశ రాజకీయాల్లో కూడా పాత్ర వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఒక దిక్సూచి తెలంగాణ.
జాతీయ రాజకీయ చిత్రానికి కొత్త నిర్వచనం ఇస్తాం. ఒక మూస ధోరణిలో ఉంది. అది మారాలి. ఈ దేశంలో 100 శాతం కాంగ్రెసేతర, బీజేపీయేతర పాలన రావాలి. నేడు తెలంగాణ ఆ మార్గాన్ని దేశానికి చూపింది. తెలంగాణ కాంగ్రెసేతర, బీజేపీయేతర రాష్ట్రం. మేం తెలంగాణ ఏజెంట్లుగా పనిచేస్తాం.
దేశానికి కొత్త వ్యవసాయ విధానం కావాలి. త్వరలో దిల్లీ వెళతాను. దేశంలో కోట్ల మంది రైతులు అన్నమో రామచంద్రా అంటున్నారు. దేశ రైతులకు, యువతకు పిలుపునిస్తున్నాం. నిరాశవద్దు. రాజకీయాలు మారతాయి.
నేడు కొందరు డర్టీ పాలిటిక్స్, సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారు. నాలుగు పార్టీలను కలిపి అదే రాజకీయమంటున్నారు. మేం పార్టీలను కాదు.. పాలిటీని.. దేశ రాజకీయాలను ఐక్యం చేస్తాం.. దేశ ప్రజలను ఐక్యం చేయబోతున్నాం.''
''రాజకీయ పార్టీల కూటమి కట్టటం పనికిరాదు.. అది ముగిసిపోయింది. ప్రజలను ఐక్యం చేసే రాజకీయం కావాలి. ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశం అదే. దేశంలో 136 కోట్ల మంది గుండె మీద చేయి వేసుకుని నిద్రపోవాలి.
దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లుంటే.. తాగటానికి నీళ్లు లేవు.. పంటలకు నీళ్లు లేవు. కానీ జబ్బలు చరుచుకుంటారు. ఈ సిల్లీ, సెన్స్‌లెస్ పాలిటిక్స్ పనికిరావు.
భారత రాజకీయ ముఖచిత్రంలో ఒక సమూల మార్పు తెస్తాం. మా దగ్గర విస్తృత అంశాలు ఉన్నాయి. త్వరలో చాలా మందిని కలుస్తాం. మాట్లాడుతాం. గ్రూపులు కాదు. బీజేపీ ముక్త్ భారత్.. కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలి.
కొత్త ఆర్థిక నమూనా కావాలి. మహా రత్నాల కింద 9.50 లక్షల కోట్లు ఉన్నాయి మురిగిపోతున్నాయి. రిజర్వు బ్యాంకు దగ్గర 8.50 లక్షల కోట్లు ఉన్నాయి. దానిదగ్గర అవసరానికి రెండు, రెండున్నర లక్షలు సరిపోతాయి.
ఒక 15, 16 లక్షల కోట్లు మురిగిపోతున్నాయి. వాటిని సద్వినియోగం చేసే సోషియో ఎకానమిక్ అజెండా కాకుండా.. మందిర్, మజిద్ అంటూ ప్రజలను ఎంగేజ్ చేస్తున్నారు.
ఇవన్నీ మారిపోవాలి. నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో అద్భుతమైన గుణాత్మక మార్పు తీసుకొస్తాం.''
సాయంత్రం 04.45
టీఆర్ఎస్ 38, కాంగ్రెస్ కూటమి 7, ఇతరులు 2 విజయం
సాయంత్రం 04.30
టీఆర్ఎస్ 33, కాంగ్రెస్ కూటమి 6, ఇతరులు 2 విజయం
సాయంత్రం 04.00
టీఆర్ఎస్ 30, కాంగ్రెస్ కూటమి 4, ఇతరులు 1 విజయం
మధ్యాహ్నం 03.30
టీఆర్ఎస్ 22, కాంగ్రెస్ కూటమి 3 విజయం
- తన్నీరు హరీశ్‌రావు: కేసీఆర్ మేనల్లుడిగా వచ్చినా.. సొంత గుర్తింపు సాధించుకున్న నాయకుడు
- కేటీఆర్: ఉద్యోగం నుంచి ఉద్యమం దాకా.. కొన్ని ముఖ్యాంశాలు
- "బావా కంగ్రాట్స్... మీకు లక్ష మెజారిటీ’’ .. ముందే ఊహించిన కేటీఆర్
- తెలంగాణ ఎన్నికల ఫలితాలు: లగడపాటి రాజగోపాల్ జోస్యం ఎందుకు తప్పింది?
- తెలంగాణ ఎన్నికల ఫలితాలు: కూకట్‌పల్లిలో సుహాసిని వెనుకంజ
తెలంగాణ ఎన్నికల ఫలితాల సరళిపై కేంద్ర మాజీ సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులుతో ఫేస్బుక్ లైవ్
మధ్యాహ్నం 03.00
టీఆర్ఎస్ విజయం 17, కాంగ్రెస్ 3
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ఆధిక్యం, మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ Live
- ఓటమి బాటలో జానారెడ్డి, ఇతర ప్రముఖులు: ఏ నియోజకవర్గంలో ఎవరిది ఆధిక్యం? - Live updates
- తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ‘ఈ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే’
- కేసీఆర్ వ్యక్తిత్వం: మాటే మంత్రంగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం
మధ్యాహ్నం 02.40
టీఆర్ఎస్ విజయం 12, కాంగ్రెస్ 1
మధ్యాహ్నం 02.35
కొడంగల్‌లో ప్రజాకూటమి అభ్యర్థి రేవంత్ రెడ్డి 9,500 తేడాతో నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 55,413 ఓట్లు రాగా, రేవంత్ రెడ్డికి 47,399 ఓట్లు పోలయ్యాయి.
మధ్యాహ్నం 02.20
టీఆర్ఎస్ విజయం 9, కాంగ్రెస్ 1
మధ్యాహ్నం 02.10
టీఆర్ఎస్ విజయం 5, కాంగ్రెస్ 1(అధికారికంగా ప్రకటించినవి)
మధ్యాహ్నం 02.05
కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటమి.
‘‘మా నేతలే నాకు వ్యతిరేకంగా ఓట్లు వేయించారు. ఐదేళ్ళు రెస్ట్ తీసుకుంటాఈ రిజల్ట్ పై నాకేం బాధలేదు. ఐదు పర్యాయాలు నన్ను ఆశీర్వదించిన నా కొల్లాపుర్ ప్రజలకు ధన్యవాదాలు.కేసీయార్ చేసిన సంక్షేమ పథకాలే రాష్ట్రంలో టీఆరెస్ గెలిచింది.’’ అని ఓటమి అనంతరం జూపల్లి అన్నారు.
మధ్యాహ్నం 02.00
టీఆర్ఎస్ 87, కాంగ్రెస్ కూటమి 24
మధ్యాహ్నం 01.55
అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు పొందడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు దేశవ్యాప్తంగా పలువురు నేతలు అభినందనలు తెలిపారు.
దేశ నలుమూలల నుంచి ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తదితరులు కేసీఆర్‌ను అభినందించారు.
మధ్యాహ్నం 01.30
అత్యంత భారీ మెజారిటీ 1,20,650తో హరీశ్ రావు విజయం
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..
''సిద్ధిపేట ప్రజలు నన్ను 1,20,650 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ గెలుపును టీఆర్ఎస్ కార్యకర్తలకే అంకితం చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చినపుడు ఎంత సంతోషంగా ఉందో.. ఈరోజు కూడా అంతే సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలు ప్రజాకూటమికి బుద్ధిచెప్పారు. తాము ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకుంటున్న కూటమి నేతలందరూ ఓడిపోతారని కేసీఆర్ అన్నారు. ఆయన అన్నట్లుగానే వారంతా మట్టికరిచారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు లేవు. తెలంగాణలో ఉన్నది టీఆర్ఎస్ మాత్రమే. నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన సిద్ధిపేట ప్రజలు నిరూపించారు. నా చర్మం ఒలిచి వీరికి చెప్పులు కుట్టించినా నా రుణం తీరదు. నా గెలుపులో కార్యకర్తల చమట చుక్కలు ఉన్నాయి. కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి'' అన్నారు.
హరీశ్ ఆధిక్యం ఏ ఎన్నికలో ఎంత?
2018 ఎన్నికలు - 1,18,699
2014 సాధారణ ఎన్నికలు - 95,328
2010 ఉప ఎన్నిక - 93,858
2009 సాధారణ ఎన్నికలు - 64,667
2008 ఉప ఎన్నిక - 58,000
2004 ఉప ఎన్నిక - 24,594
మధ్యాహ్నం 01.30
టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ కూటమి 23
మధ్యాహ్నం 01.20
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు.
మధ్యాహ్నం 01.10:
మధ్యాహ్నం 01.00:
ఆధిక్యం: టీఆర్ఎస్ 90, ప్రజాకూటమి 20
టీఆర్ఎస్ పెద్దసంఖ్యలో స్థానాల్లో ఆధిక్యంలో ఉండడంతో ఆ పార్టీ నేతలు ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఇలా డప్పు కొడుతూ సంతోషాన్ని పంచుకున్నారు.
కేటీఆర్ ట్వీట్‌పై కామెంట్ చేస్తూ అభినందనలు తెలిపిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా
సమయం 12.45:
సిద్ధిపేటలో లక్షకు పైగా ఆధిక్యంతో సరికొత్త రికార్డు దిశగా సాగుతున్న హరీశ్ రావు
ఫొటో సోర్స్, Twitter/TRSparty
సమయం 12.40
ఆధిక్యం: టీఆర్ఎస్ 91, ప్రజాకూటమి 19
తెలంగాణ ఎన్నికల ఫలితాల సరళిపై సీనియర్ పాత్రికేయులు కృష్ణారావుతో బీబీసీ తెలుగు ఫేస్బుక్ లైవ్
సమయం 12.35
కేసీఆర్‌పై నమ్మకం ఉంచుతూ మరోసారి తమకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ కేటీఆర్ చేసిన ట్వీట్
సమయం 12.20
ఆధిక్యం: టీఆర్ఎస్ 87, ప్రజాకూటమి 24
సమయం 12.10
ఆధిక్యం: టీఆర్ఎస్ 85, ప్రజాకూటమి 25
గజ్వేల్‌లో టీఆర్ఎస్ విజయోత్సవాలు.. బీబీసీ తెలుగు ఫేస్ బుక్ లైవ్
సమయం 11.45
ఆధిక్యం: టీఆర్ఎస్ 83, ప్రజాకూటమి 27
11.42:
హైదరాబాద్‌లోని అంబర్పేట్ నియోజకవర్గంలో బీజేపీ నేత కిషన్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.
11.40
టీఆర్ఎస్ ఆధిక్యం నేపథ్యంలో టపాకాయలు కాలుస్తున్న ఆ పార్టీ శ్రేణులు
టీఆర్ఎస్ ఆధిక్యం నేపథ్యంలో టపాకాయలు కాలుస్తున్న ఆ పార్టా శ్రేణులు
సమయం 11.20
ఆధిక్యం: టీఆర్ఎస్ 79, ప్రజాకూటమి 30
సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు పర్సా వెంకటేశ్వరరావుతో బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్బుక్ లైవ్
వెలవెలబోతున్న గాంధీభవన్
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తుండడంపై ఆ పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఏమన్నారో ‘బీబీసీ న్యూస్ తెలుగు’ ఫేస్బుక్ లైవ్‌లో చూడండి.
సమయం 11.05
ఆధిక్యం: టీఆర్ఎస్ 80, ప్రజాకూటమి 30
కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుతో బీబీసీ తెలుగు ఫేస్బుక్ లైవ్ ఇక్కడ చూడండి.
సమయం 11.00
ఆధిక్యం: టీఆర్ఎస్ 78, ప్రజాకూటమి 32
చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ విజయం
సమయం 10.50
ఆధిక్యం: టీఆర్ఎస్ 78, ప్రజాకూటమి 33
సమయం 10.40
ఆధిక్యం: టీఆర్ఎస్ 76, ప్రజాకూటమి 33
జగిత్యాలలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఓటమి
సమయం 10.30
ఆధిక్యం: టీఆర్ఎస్ 77, ప్రజాకూటమి 33
సమయం 10.25
ఆధిక్యం: టీఆర్ఎస్ 77, ప్రజాకూటమి 33
సమయం 10.20
ఆధిక్యం: టీఆర్ఎస్ 76, ప్రజాకూటమి 33
సమయం 10.15
ఆధిక్యం: టీఆర్ఎస్ 73, ప్రజాకూటమి 33
సమయం 10.10
ఆధిక్యం: టీఆర్ఎస్ 72, ప్రజాకూటమి 34
సమయం 10.05
ఆధిక్యం: టీఆర్ఎస్ 68, ప్రజాకూటమి 35
సమయం 10.00
ఆధిక్యం: టీఆర్ఎస్ 66, ప్రజాకూటమి 33
10.00 గంటలకు ఎవరెవరు ఆధిక్యంలో ఉన్నారు?
సిర్పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు, చెన్నూరులో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఆధిక్యంలో ఉన్నారు.
ఆదిలాబాద్ స్థానంలో జోగు రామన్న(టీఆర్ఎస్), సిరిసిల్లలో కేటీ రామారావు(టీఆర్ఎస్), సిద్దిపేటలో హరీశ్‌రావు(టీఆర్ఎస్), గజ్వేల్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(టీఆర్ఎస్) ఆధిక్యంలో ఉన్నారు. తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డి(టీఆర్ఎస్) వెనకంజలో ఉన్నారు.
అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి(బీజేపీ), చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం) ముందంజలో ఉన్నారు.
ఖమ్మంలో నామా నాగేశ్వరరావు(టీడీపీ) వెనకంజలో ఉన్నారు.
సమయం 09.48
ఆధిక్యం: టీఆర్ఎస్ 63, ప్రజాకూటమి 32
సమయం 09.40
ఆధిక్యం: టీఆర్ఎస్ 63, ప్రజాకూటమి 31
సమయం 09.35
ఆధిక్యం: టీఆర్ఎస్ 61, ప్రజాకూటమి 33
సమయం 09.27:
ఆధిక్యం: టీఆర్ఎస్ 60, ప్రజాకూటమి 32
సమయం 9.18
ఆధిక్యం టీఆర్ఎస్ 48, కాంగ్రెస్ కూటమి 38, బీజేపీ 05, ఇతరులు 08
తొలిగంటలో హోరాహోరీ
సమయం 09.00
టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి చెరి 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ 03 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తెలంగాణవ్యాప్తంగా 43 ప్రాంతాల్లో కౌంటింగ్ జరుగుతోంది.
సిర్పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు, చెన్నూరులో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఆధిక్యంలో ఉన్నారు.
ఆదిలాబాద్ స్థానంలో జోగు రామన్న(టీఆర్ఎస్), సిరిసిల్లలో కేటీ రామారావు(టీఆర్ఎస్), సిద్దిపేటలో హరీశ్‌రావు(టీఆర్ఎస్), గజ్వేల్‌లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(టీఆర్ఎస్) ఆధిక్యంలో ఉన్నారు. తాండూరులో పట్నం మహేందర్‌రెడ్డి(టీఆర్ఎస్) వెనకంజలో ఉన్నారు.
అంబర్‌పేటలో కిషన్‌రెడ్డి(బీజేపీ), చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం) ముందంజలో ఉన్నారు.
ఖమ్మంలో నామా నాగేశ్వరరావు(టీడీపీ) వెనకంజలో ఉన్నారు.
సమయం 8.54
ఆధిక్యం టీఆర్ఎస్ 25, కాంగ్రెస్ కూటమి 30, బీజేపీ 03, ఇతరులు 04
సమయం: 08.43
ఆధిక్యం: టీఆర్ఎస్ 10, ప్రజాకూటమి 15, బీజేపీ 2, ఇతరులు 3
సమయం: 08.36
ఆధిక్యం: టీఆర్ఎస్ 8, ప్రజాకూటమి 13, బీజేపీ 2
సమయం: 8.33
ఆధిక్యం: టీఆర్ఎస్ 8, ప్రజాకూటమి 10, బీజేపీ 1
తొలి రౌండ్లో ప్రజాకూటమి, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ.
సమయం: 8.28
ఆధిక్యం: టీఆర్ఎస్ 6, ప్రజాకూటమి 9, బీజేపీ 1
సమయం 8.26
ఆధిక్యం టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 2
సమయం 8.20
ఆధిక్యం టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1.
మల్కాల్గిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి, ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ ఆధిక్యం
సమయం 8.10
ఆధిక్యం టీఆర్ఎస్ 01. మిగతా పార్టీలు 0
మల్కాజ్‌గిరిలోని మైనంపల్లి హన్మంతరావు ఆధిక్యం.
సమయం: 8 గంటలు
కౌంటింగ్ ప్రారంభం. తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 43 ప్రాంతాల్లో కౌంటింగ్ ప్రారంభమైంది.
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.
సమయం 7.50
ఓట్ల లెక్కింపునకు మరో 10 నిమిషాల సమయం ఉంది కదా.. ఈ లోపు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో ఓసారి చూద్దాం.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి లగడపాటి రాజగోపాల్ సర్వే తప్ప తక్కినవన్నీ తెరాసకే ఆధిక్యం వస్తుందని తెలిపాయి.
లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ మాత్రం కాంగ్రెస్ కూటమికి ఆధిక్యం వస్తుందని తెలిపింది.
హైదరాబాద్‌లో సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద భద్రత
ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది?
119 నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్రంలో 43 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఎన్నికల ఫలితాల వెల్లడి వరకు బాధ్యత అంతా రిటర్నింగ్ అధికారిపైనే ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎలక్షన్ ఏజెంట్లను ఆయనే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తారు.
ఎన్నికల సంఘం నిబంధన 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం, లెక్కించే సమయం తదితర వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు.
నిబంధన 52 ను అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14కు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించవచ్చు.
నిబంధన 55(సీ) ప్రకారం ఈవీఎంలు టాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగా ఉందని లెక్కింపు సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు నిర్ధారించుకోవాలి. ఒక వేళ ఈవీఎంలు సక్రమంగా లేవని భావిస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలి.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ప్రతి కౌటింగ్ టేబుల్ మీద బ్లూపాయంట్ పెన్. ఫారం 17(సీ)లోని పార్ట్ 2 పేపర్ ఉంచాలి.
కౌంటింగ్‌కు ముందు 17(సీ) ఫారం ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తర్వాత ఈవీఎంల సీల్‌ను తొలగించి రిజల్ట్ బటన్‌ను నొక్కుతారు.
అప్పుడు ఒక్కో అభ్యర్థికి ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుస్తుంది. ఆ గణాంకాలను నోట్ చేసుకుంటారు.
ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి ప్రకటిస్తారు.
ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్ వైజర్, అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్లు ఉంటారు.
ఫొటో సోర్స్, Eci
లెక్కింపు ప్రక్రియ అంతా పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో సాగుతుంది. ప్రతి రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు.
ఎన్నికల సంఘం పరిశీలకుడు మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపల ఫోన్ వినియోగించుకోడానికి అర్హులు. మిగిలిన వారు ఫోన్ తీసుకెళ్లడానికి అనుమతించరు.
ఎన్నికల సంఘం లెక్కింపును వీడియో తీస్తుంది. దాన్ని సీడీలలో భద్రపరిచి ఉంచుతుంది.
కౌంటింగ్ మగిశాక అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఏదైనా ఒక వీవీ ఫ్యాట్‌లోని ఓటర్ స్లిప్పులను లెక్కించి ఆ ఈవీఎంలలో పోలైన ఓట్లతో సమానంగా ఉన్నాయా లేదా అని సరిచూస్తారు.
తుది ఫలితాలకు సంబంధించిన పత్రాన్ని ఫారం 20గా పిలుస్తారు. దీన్ని సిద్ధం చేయడానికంటే ముందు రీకౌంటింగ్‌కు ఏ అభ్యర్థి అయినా కోరుతున్నారా అనేది రిటర్నింగ్ అధికారి తెలుసుకుంటారు. వారి లిఖితపూర్వక ఫిర్యాదును ఎన్నికల పరిశీలకుడితో చర్చించి అవసరం ఉంటే రీకౌంటింగ్ చేపడుతారు. అవసరం లేదని భావిస్తే ఫారం 20పై సంతకం చేసి విజేతను ప్రకటిస్తారు.
ఎన్నికల సంఘం నిబంధన 67ను అనుసరించి రిటర్నింగ్ అధికారి గెలిచిన అభ్యర్థి వివరాలను ఎన్నికల సంఘానికి, శాసన సభకు అందిస్తారు.
ఇవి కూడా చదవండి:
- 64 నియోజకవర్గాల్లో 5 శాతం కన్నా ఎక్కువ పెరిగిన ఓటింగ్
- గద్దర్ ఇంటర్వ్యూ: 'ఓటు కూడా ఒక పోరాట రూపమే'
- ఎగ్జిట్ పోల్స్‌ను ఎంత వరకు నమ్మొచ్చు? తుది ఫలితాలను అవి ఎంత వరకు అంచనా వేయగలవు?
- తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- పెయిడ్ న్యూస్: ‘తెలంగాణ ఎన్నికల్లో రూ.100 కోట్ల చెల్లింపు వార్తలు’
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)