తెలంగాణ ఎన్నికల ఫలితాలు: ‘ఈ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే’

  • 11 డిసెంబర్ 2018
తెలంగాణ ఎన్నికలు Image copyright KCR/FACEBOOK

‘‘సిద్ధిపేట ప్రజలు నన్ను 1,20,650 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ గెలుపును టీఆర్ఎస్ కార్యకర్తలకే అంకితం చేస్తున్నా..’’ అని హరీష్ రావు అన్నారు.

భారీ మెజారిటీతో విజయం సాధించిన టీఆర్ఎస్ నేత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చినపుడు ఎంత సంతోషంగా ఉందో.. ఈరోజు కూడా అంతే సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రజలు ప్రజాకూటమికి బుద్ధిచెప్పారని ఆయన అన్నారు.

‘‘ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలందరూ ఓడిపోతారని కేసీఆర్ అన్నారు.

ఆయన అన్నట్లుగానే జరిగిందికదా.. జానారెడ్డి గారు, గీతారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, డీకే అరుణ గారు, దామోదర్ రాజనరసింహగారు, బట్టి విక్రమార్కగారు.. వీరతా మట్టికరిచిండ్రు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు లేవు. తెలంగాణలో ఉన్నది టీఆర్ఎస్ మాత్రమే. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష. నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన సిద్ధిపేట ప్రజలకు శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

నా చర్మం ఒలిచి వీరికి చెప్పులు కుట్టించినా తక్కువేనేమో అనిపిస్తోంది. నా గెలుపులో కార్యకర్తల చమట చుక్కలు ఉన్నాయి. కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి.’’ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)