‘ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు’... తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నాయుడు స్పందన

  • 11 డిసెంబర్ 2018
నారా చంద్రబాబు నాయుడు Image copyright tdp.ncbn.official/facebook

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

‘‘దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడింది. గత 5ఏళ్లలో జరిగిన అనేక ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడమే కాకుండా, ఇప్పుడు తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ పూర్తిగా బలహీనపడింది.బీజేపీ పాలన పట్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. గత 5ఏళ్లలో బీజేపీ చేసిందేమీ లేదనేది అన్ని వర్గాల ప్రజలు గుర్తించారు. ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.బీజేపీకి వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటానికి ప్రజలు అండగా ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం ఏర్పాటుకు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దోహదపడతాయి.తెలంగాణలో ప్రజా తీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభినందనలు. ఐదు రాష్ట్రాలలో గెలుపొందిన శాసన సభ్యులందరికీ అభినందనలు’’ అని నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)