రెండే రెండు ఫొటోల్లో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయాల భవనాలు

  • 11 డిసెంబర్ 2018
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్
చిత్రం శీర్షిక కార్యకర్తలు, నాయకులు లేక వెలవెలబోతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. కారు జోరుకు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి వంటి హేమాహేమీలంతా ఓడిపోయారు.

టీఆర్ఎస్ నేతల్లో సిద్ధిపేటలో హరీశ్ రావు రికార్డు స్థాయిలో లక్షా 20 వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ 60 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనాల వద్ద పరిస్థితి ఇలా ఉంది.

నాయకులు లేక గాంధీ భవన్ వెలవెలబోతుండగా.. టీఆర్ఎస్ భవన్ వద్ద సంబురాలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి.

చిత్రం శీర్షిక తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ లో కార్యకర్తలు, నాయకుల సంబురాలు

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీబీసీ కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)