హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్

  • 11 డిసెంబర్ 2018
హరీశ్ రావు Image copyright trspartyonline/facebook

టీఆర్ఎస్ నేత హరీశ్ రావు భారీ ఆధిక్యంతో గెలవడంతో ఆయన దేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారని వార్తలు వెలువడుతున్నాయి.

సిద్ధిపేట నియోజవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన హరీశ్ రావు 1,18,699 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు వరసుగా ఇది ఏడో విజయం. 2004 ఉప ఎన్నికల నుంచి ఆయన భారీ అధిక్యతతో గెలుస్తూనే ఉన్నారు.

ఈసారి లక్ష కంటే ఎక్కువ మెజారిటీ సాధించిన హరీశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక మెజారిటీ సాధించిన రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే, దేశంలో అత్యధిక మెజారిటీ సాధించిన రికార్డు సునీల్ కుమార్ శర్మ పేరిట ఉంది.

Image copyright Sharma/fb
చిత్రం శీర్షిక దేశంలో ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ శర్మ పేరిట ఉంది

2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సాహిబాబాద్ అసెంబ్లీ నియోజకర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన సునీల్ కుమార్ శర్మ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత అమర్ పాల్ శర్మ మీద 1,50,685 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డుగా ఉంది.

ఘాజియా బాద్ జిల్లా పరిధిలో ఉండే సాహిబాబాద్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 8,65,641గా ఉంది. 2017 ఎన్నికల్లో సునీల్ కుమార్ శర్మకు 2,62,741 ఓట్లు రాగా, అమర్ పాల్ శర్మకు 1,12,056 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో సునీల్ శర్మ 61.69 శాతం ఓట్లు సాధించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)